Fans Create Hungama At Theatres For Adipurush Trailer Release
Adipurush: యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు నేడు రిలీజ్ అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, నేడు రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు చేసిన సందడి మామూలుగా లేదు.
Adipurush Trailer : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారా?
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, థియేటర్ల వద్ద దుమ్ములేపారు. ఆదిపురుష్ ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేసిన సందర్భంగా అభిమానుల కోలాహలంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఏర్పడింది. నెల్లూరులో ప్రభాస్ జెండాలతో ఫ్యాన్స్ హంగామా చేశారు. తీన్మార్ మ్యూజిక్, అరుపులు కేకలతో ఉత్సాహంగా కనిపించారు అభిమానులు.
శ్రీకాకుళంలోని పలు థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారు ఆదిపురుష్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. అటు విశాఖలో ఆదిపురుష్ త్రీడి ట్రైలర్ చూసి ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా ఇండియన్ రికార్డులను బ్రేక్ చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు భీమవరంలో త్రీడీ ట్రైలర్‌ను చూసి ప్రభాస్ మరో రాముడుగా అభిమానులు పేర్కొన్నారు. రాముడు రూపంలో ఉన్న ప్రభాస్‌కు పాలాభిషేకం చేసిన అభిమానులు, జైశ్రీరామ్ అంటూ సినిమా దియేటర్స్‌లో హల్చల్ చేశారు.
Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్.. ట్రైలర్‌లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు థియేటర్లలో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కాగా, ఈ ట్రైలర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందని అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. ఈ ప్రాంతాలే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని చోట్లా ఇదే సీన్ కనిపించింది. రాముడిగా ప్రభాస్ విశ్వరూపం చూపించబోతున్నాడని.. ఈ సినిమాతో దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను ప్లాన్ చేశాడని అభిమానులు అంటున్నారు.