Chakda Xpress
Chakda Xpress : మహిళల వన్డే ప్రపంచకప్ 2025ని భారత మహిళా జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాని ఓడించి భారత జట్టు విజయం సాధించి సరికొత్త చరిత్ర రాసింది. ఈ గెలుపుతో మహిళల క్రికెట్ కి మరిన్ని మంచి రోజులు రానున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా భారత మహిళా జట్టు వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఓ సినిమాని రిలీజ్ చేయమని క్రికెట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అడుగుతున్నారు.(Chakda Xpress)
క్రికెట్ ఫ్యాన్స్ రిలీజ్ చేయమని అడుగుతున్న సినిమా ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’. మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ చక్‌దా ఎక్స్‌ప్రెస్. విరాట్ కోహ్లీ భార్య, అనుష్క శర్మ మెయిన్ లీడ్ లో ఈ బయోపిక్ తెరకెక్కింది. అప్పట్లో వచ్చిన ఈ ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు, పూర్తయి రెండేళ్లు అయినా ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు.
Also Read : Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..
భారత్ మహిళా జట్టుకి వరల్డ్ కప్ తీసుకురావాలని కొన్నేళ్లుగా పోరాడిన వాళ్లలో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచాక కూడా మహిళా జట్టు కప్పు తీసుకెళ్లి వీళ్ళ ఇద్దరి చేతుల్లోనే పెట్టారు. మిథాలీ, జులన్ ఆ కప్పుని చూసి ఎమోషనల్ అయ్యారు. 20 ఏళ్లు తాము ప్రయత్నించామని కానీ ఇప్పుడు వీళ్ళు సాధించారని భావోద్వేగానికి గురయ్యారు.
అందుకే ఇలాంటి మంచి సమయంలో ఇప్పుడైనా జులన్ గోస్వామి బయోపిక్ చక్‌దా ఎక్స్‌ప్రెస్ సినిమాని రిలీజ్ చేయాలని కోరుతున్నారు. పైగా ఈ సినిమా అనుష్క శర్మ కి కంబ్యాక్ సినిమా కూడా. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఇప్పుడైనా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. ఆ సినిమాలో జులన్ గోస్వామి వరల్డ్ కప్ గెలవకుండానే రిటైర్మెంట్ ప్రకటించేసినట్టే ఉంటుంది. ఇప్పుడు తమ తర్వాత టీమ్ వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి ఇంకొన్ని సీన్స్ షూట్ చేసి రిలీజ్ చేస్తారేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి చక్‌దా ఎక్స్‌ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.
Also Read : Jabardasth : ఒకేసారి జబర్దస్త్ వదిలేస్తున్న ఆరుగురు టీమ్ లీడర్లు..? జబర్దస్త్ లో ఏమైంది? రాకెట్ రాఘవ కూడా..?