Jabardasth : ఒకేసారి జబర్దస్త్ వదిలేస్తున్న ఆరుగురు టీమ్ లీడర్లు..? జబర్దస్త్ లో ఏమైంది? రాకెట్ రాఘవ కూడా..?

తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. (Jabardasth)

Jabardasth : ఒకేసారి జబర్దస్త్ వదిలేస్తున్న ఆరుగురు టీమ్ లీడర్లు..? జబర్దస్త్ లో ఏమైంది? రాకెట్ రాఘవ కూడా..?

Jabardasth

Updated On : November 4, 2025 / 8:10 AM IST

Jabardasth : తెలుగు టీవీ ప్రేక్షకులను చాలా ఏళ్లుగా నవ్విస్తున్న షో జబర్దస్త్. కామెడీ స్కిట్స్ తో జబర్దస్త్ షో అందర్నీ నవ్విస్తుంది. జబర్దస్త్ షోతో ఎంతమంది కమెడియన్స్ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఎంతోమంది కమెడియన్స్, నటులు సక్సెస్ అయ్యారు. పలువురు యాంకర్స్ కూడా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే జబర్దస్త్ వచ్చిన దగ్గర్నుంచి ఛేంజెస్ జరుగుతూనే ఉన్నాయి.(Jabardasth)

యాంకర్లు మారారు, టీమ్ లీడర్స్ మారారు, చాలా మంది కొత్త కమెడియన్స్ వచ్చారు, జడ్జీలు మారారు, రెండు షోలుగా మారింది, మళ్ళీ ఒకే షోగా మారింది. ఇలా కొత్తగా ఉండటానికి ఏదో ఒక మార్పు చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి పెద్ద మార్పే జరగబోతుందని తెలుస్తుంది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ కి భారతరత్న..? బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో భారతరత్న ఎవరెవరికి వచ్చింది?

ఈ ఎపిసోడ్ లో టీమ్స్ కాకుండా సీనియర్స్, జూనియర్స్, లేడీస్, పిల్లలు.. ఇలా సపరేట్ స్కిట్స్ చేసారు. ఈ ఎపిసోడ్ లో పదికి పది తమ టీమ్ కి రాకపోతే జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోతామని సీనియర్స్, టీమ్ లీడర్స్ చెప్పారు. ప్రోమో చివర్లో ధనరాజ్, మిగిలిన సీనియర్ కమెడియన్స్ రామ్ ప్రసాద్, చంటి, రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ లు మేము జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నాము. మమ్మల్ని ఎలాగైతో ఆదరించారో మా తర్వాత వాళ్ళని కూడా అలాగే ఆదరించండి అంటూ ఎమోషనల్ అయి జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

జబర్దస్త్ లో మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిసిందే కానీ ఒకేసారి ఆరుగురు సీనియర్స్, టీమ్ లీడర్లు వెళ్లిపోవడం ఏంటి? జబర్దస్త్ లో ఏం జరిగింది అని చర్చగా మారింది. అయితే వీరిలో చాలా మంది జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రాకెట్ రాఘవ మాత్రం మొదటి స్కిట్ నుంచి ఇప్పటివరకు జబర్దస్త్ లోఒక్క షో కూడా మిస్ అవ్వలేదు. ఆయన మాత్రం బయటకు వెళ్ళలేదు. మరి ఇప్పుడు రాకెట్ రాఘవ కూడా వాళ్ళతో పాటు స్టేజిపై నిల్చోవడంతో అతను కూడా వెళ్ళిపోతున్నాడా అని సందేహం నెలకొంది.

Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ విమర్శలు.. విజయ్ మీదేనా? లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసి వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు..

ఇంతమంది జబర్దస్త్ నుంచి ఒకేసారి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? లేదా అందరూ ముందే మాట్లాడుకొని వెళ్తున్నారా అనే టాపిక్ ఇపుడు వైరల్ గా మారింది. లేదా ప్రోమో కోసం ఇలా చూపించారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ నుంచి ఆరుగురు కమెడియన్స్ఒకేసారి వెళ్లిపోవడం చర్చగా మారింది.

మీరు కూడా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..