Chiranjeevi : మెగాస్టార్ కి భారతరత్న..? బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో భారతరత్న ఎవరెవరికి వచ్చింది?

తాజాగా బండ్ల గణేష్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Chiranjeevi)

Chiranjeevi : మెగాస్టార్ కి భారతరత్న..? బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో భారతరత్న ఎవరెవరికి వచ్చింది?

Chiranjeevi

Updated On : November 4, 2025 / 7:29 AM IST

Chiranjeevi : మెగాస్టార్ గురించి ప్రతి తెలుగు వాళ్లకు తెలుసు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి దాదాపు మూడు దశాబ్దాలు సినీ పరిశ్రమని మెగాస్టార్ గా ఏలారు. మధ్యలో కొన్నాళ్ళు రాజకీయాలకు వెళ్లొచ్చిన మళ్ళీ ఇప్పుడు సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా యువ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయన చూడని రికార్డులు, అవార్డులు, రివార్డులు, హిట్లు లేవు..(Chiranjeevi)

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికే చిరంజీవి సినీ పరిశ్రమకు, సమాజానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. అయితే పద్మ విభూషణ్ వచ్చినప్పుడే భవిష్యత్తులో భారతరత్న కూడా వస్తుందని పలు వార్తలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేష్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ విమర్శలు.. విజయ్ మీదేనా? లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసి వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు..

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ K ర్యాంప్ సక్సెస్ మీట్ హాజరవ్వగా ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరంని చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో ఇలాగే ఉండేవాళ్ళు. 150 సినిమాలు చేసినా కూడా.. రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజుకి గ్రౌండ్ లెవల్ లోనే ఉంటారు. నీ లాంటి వాళ్ళు చిరంజీవి గారిని ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తుంది అని అన్నారు.

దీంతో చిరంజీవికి రేపో మాపో భారత రత్న వచ్చేస్తుందని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి నిజంగానే మెగాస్టార్ కి భారతరత్న అవార్డు వస్తుందా చూడాలి.

Also Read : Vishnupriya : విష్ణుప్రియ మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదంట..

ఇండియన్ సినీపరిశ్రమలో ఇప్పటివరకు భారతరత్న అవార్డులకు అందుకున్నది వీరే..

MGR – యాక్టర్
సత్యజిత్ రే – డైరెక్టర్
MS సుబ్బలక్ష్మి – సింగర్
రవి శంకర్ – మ్యూజిక్ డైరెక్టర్
లతా మంగేష్కర్ – సింగర్
భీం సేన్ జోషి – సింగర్
భూపేన్ హజారికా – సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ లు భారతరత్న అవార్డు అందుకున్నారు. వీరిలో కొంతమందికి మరణించాక కూడా అవార్డు ప్రకటించారు. SP బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ లకు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్స్ వచ్చినా ఇంకా ఇవ్వలేదు.

 

Also Read : Vishnupriya : మూడేళ్ళ వయసులో అమ్మనాన్న విడిపోయారు.. నాన్నతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు.. అమ్మ చనిపోయాక..