Bandla Ganesh : బండ్ల గణేష్ విమర్శలు.. విజయ్ మీదేనా? లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసి వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు..
ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.(Bandla Ganesh)
                            (Bandla Ganesh
Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలిసిందే. స్టేజిపైకి ఎక్కారంటే తన స్పీచ్ తో వైరల్ అవ్వాల్సిందే. మధ్యలో కొన్నాళ్ళు సైలెంట్ అయిన బండ్ల గణేష్ ఇటీవల మళ్ళీ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కనపడి తన స్పీచ్ లతో వైరల్ అవుతున్నారు. తాజాగా బండ్ల గణేష్ కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సక్సెస్ మీట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.(Bandla Ganesh)
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో ఒక కుర్రాడు, నిజాయితీ ఉన్న యువకుడు, చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలి. కష్టపడి తన కలలు నిజం చేసుకోడానికి నేను సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, హీరో కావాలని ఒక సంకల్పంతో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయచోటి నుంచి బెంగళూరు వెళ్లి జాబ్ చేసుకుంటూ సినిమాల్లోకి వచ్చి తన కలని నిజం చేసుకున్నాడు.
Also Read : Divvela Madhuri : బిగ్ బాస్ లో దివ్వెల మాధురి రెమ్యునరేషన్ ఎంత? ఆ డబ్బు ఏం చేస్తారు?
ఇటీవల కొంతమంది ఒక్క సినిమా హిట్ అయితే వాట్సాప్ వాట్సాప్.. ఏం కావాలి అని మాట్లాడుతున్నారు. ఒక హిట్ పడగానే అర్ధరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకునే ఈ రోజుల్లో హిట్ మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలాగా మారిపోయాడు. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళ అద్దాలు పెట్టుకొని నడిచే ఈ రోజుల్లో కిరణ్ రియల్ గా ఉన్నాడు. కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవి గుర్తొస్తున్నారు.
Bandla Ganesh
చిరంజీవి స్టార్టింగ్ రోజుల్లో ఇలాగే ఉండేవాళ్ళు. 150 సినిమాలు చేసినా, రేపో మాపో భారతరత్న తీసుకున్నా చిరంజీవి ఇవాళ్టికి గ్రౌండ్ మీదే ఉంటాడు. కిరణ్.. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకో. నేను చెప్తున్నా కిరణ్.. నీకు తిరుగు లేదు. నీ క్యారెక్టర్ మార్చుకోకు. నీ సినిమా,నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీదే చూపించు. బయట చూపించకు. గొప్ప విషయం ఏంటంటే కిరణ్ చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ తోనే చేశాడు. ఒక్క హిట్ పడితేనే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ ని తీసుకురా, అనిల్ రావిపూడిని తీసుకురా అని అడుగుతున్న ఈ రోజుల్లో కొత్త వాళ్ళను ఏరుకొచ్చి దర్శకులను చేసాడు.
Also Read : Sudheer Babu : అయ్యో.. ఇప్పటిదాకా మహేష్ ని బావ అని పిలవలేదంట.. పిలిస్తే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..
కిరణ్ ని చూసి మీరు నేర్చుకోండి. మీరు ఒకప్పుడు కొత్తవాళ్లే. మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళా? మీ గతాన్ని మర్చిపోకండి. ప్రేమతో, కష్టంతో, కసితో సినిమా చేస్తే హిట్ అవుతుంది వాట్సాప్ అంటే హిట్టు రాదు అని ఫైర్ అయ్యారు. చివర్లో తమ్ముడు కిరణ్ అబ్బవరాన్ని చూసి ప్రేమ ఎక్కువై నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి అని అనడం గమనార్హం.
Bandla Ganesh
దీంతో బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వాట్సాప్ అంటూ స్టేజిపై హడావిడి చేసేది విజయ్ దేవరకొండ ఒక్కడే. దీంతో బండ్ల గణేష్ కామెంట్స్ విజయ్ మీదేనా అని సోషల్ మీడియాలో చర్చగా మారింది. కొంతమంది అయితే క్యాప్, కళ్లద్దాలు, కాలు మీద కాలు వేసుకోవడం బన్నీని ఉద్దేశించి అన్నాడు అని అంటున్నారు. బండ్ల గణేష్ ఎవరి పేరు చెప్పకుండా కొంతమంది హీరోలపై ఇలా విమర్శలు చేయడంతో ఈయన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
Also Read : Vishnupriya : విష్ణుప్రియ మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదంట..
