Cameraman Gangatho Rambabu : అభిమానం పీక్స్ కెళ్లి థియేటర్‌ను తగలబెట్టిన ఫ్యాన్స్

పవన్ కల్యాణ్ 'కెమెరా‌మెన్ గంగతో రాంబాబు' సినిమా రీ రిలీజ్ అయ్యింది. మితిమీరిన అభిమానంతో థియేటర్లలో మంటలు పెట్టి ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cameraman Gangatho Rambabu

Cameraman Gangatho Rambabu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘కెమెరా‌మెన్ గంగతో రాంబాబు’ అక్టోబర్ 18, 2012 లో వరల్డ్ వైడ్ రిలీజైంది. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అభిమానం పీక్స్ కెళ్లి థియేటర్లో మంటలు పెట్టి దాని చుట్టూ డ్యాన్స్  చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Lal Salaam : రజనీకాంత్ ‘లాల్ సలామ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లకి రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అంటే క్రాకర్లు కాల్చడం.. డ్యాన్సులు చేయడం గురించి విన్నాం. కానీ థియేటర్లలో మంటలు పెట్టి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేయడం విపరీతంగా మారింది. తాజాగా పవన్ కల్యాణ్-తమన్నా భాటియా జంటగా నటించిన ‘కెమెరా‌మెన్ గంగతో రాంబాబు’ సినిమా రీ రిలీజైంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ  2012 లో రిలీజైంది. మళ్లీ ఈ సినిమా రీ రిలీజ్‌తో థియేటర్లలో పవన్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్లో మంటలు పెట్టి డ్యాన్సులు చేస్తూ రచ్చ చేయడంతో షో ఆపేసారు థియేటర్ యజమానులు. ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటనే వివరాలు తెలియలేదు కానీ.. వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tillu Square : టిల్లు స్క్వేర్ నుండి బర్త్ డే బాయ్ సిద్దూ కోసం గ్లింప్స్ రిలీజ్

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కడ హంగామా చేసిన వారిని తిట్టి పోశారు. ‘ఇలా చేస్తే థియేటర్లు ఇవ్వరు ఇంకోసారి’ అని మండిపడ్డారు. ‘ఇలాంటి పనుల వల్ల నిజమైన ఫ్యాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని’ కామెంట్స్ చేశారు. కాగా ఈ మూవీ నట్టీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ రీ రిలీజ్ చేశారు. ప్రతి టిక్కెట్ నుండి రూ.10 జనసేన పార్టీకి ఫండ్‌గా అందిస్తామని నట్టి కుమార్ తెలిపారు.