Lal Salaam : రజనీకాంత్ ‘లాల్ సలామ్’ తెలుగు ట్రైలర్ చూశారా? మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్ స్టార్..
విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Lal Salaam
Lal Salaam Trailer : రజినీకాంత్ (Rajinikanth) ఇటీవల జైలర్ సినిమాతో భారీ సక్సెస్ సాధించారు. ఇప్పుడు ‘లాల్ సలామ్’ సినిమాతో రాబోతున్నారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా రజినీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9న తమిళ్, తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో మొయినుద్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నాడు. రజిని మొదటిసారి ఇలాంటి పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల ఆల్రెడీ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
లాల్ సలామ్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో ఇండియన్‌గా నేర్చుకోవల్సింది అదే’ అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ హైలైట్ అయ్యింది. దీంతో ఈ సినిమా కోసం రజిని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.