Dear Nanna : నాన్న కొడుకుల ఎమోషనల్ సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డియర్ నాన్న

డియర్ నాన్న సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Dear Nanna : నాన్న కొడుకుల ఎమోషనల్ సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డియర్ నాన్న

Father Son Emotional Movie Dear Nanna treaming in Aha OTT

Dear Nanna : చైతన్య రావ్, యష్ణ చౌదరి జంటగా సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘డియర్ నాన్న’. అంజి సలాది దర్శకత్వంలో రాకేష్ మహంకాళి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించారు. డియర్ నాన్న సినిమా ఫాదర్ డే స్పెషల్ గా నేడు జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Honeymoon Express : చాన్నాళ్లకు ప్రమోషన్స్ లో కనిపించిన హెబ్బా పటేల్.. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

కరోనా బ్యాక్ డ్రాప్ లో తండ్రీకొడుకుల ఎమోషన్ ని అద్భుతంగా చూపించారు. చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ కి తన జీవితంలో ఎదురైన సంఘటనలతో తనలో కలిగిన మార్పు ఏంటి అని మంచి ఎమోషన్ తో ఈ సినిమాకి తెరకెక్కించారు. తండ్రి కొడుకులుగా చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మెప్పించారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ఇంపార్టెంట్, వాళ్ళు చేసిన త్యాగాల గురించి ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో డియర్ నాన్న సినిమా దూసుకుపోతుంది.