‘ఆకాశం నీ హద్దు రా’ లేడీ పైలట్ గురించి మీకు తెలుసా

Aakaasam Nee Haddhu Ra: ఇటీవలే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో విడుదలైన ‘ఆకాశం నీ హద్దు రా’ క్లైమాక్స్‌లో ఓ లేడీ పైలట్ కనిపిస్తుంది కదా. ఆమె గురించి మీకు తెలుసా. అదేనండీ.. హీరో తల్లి క్యారెక్టర్‌లో ఉన్న కవితా రంజిని.. సూర్యాని ఇప్పుడు ఈ విమానం నడిపింది ఈ అమ్మాయేనా అని అడుగుతుందే… తనే వర్షా నాయర్.

ఆమె రీల్ లైఫ్‌లో పైలట్ కాదు.. రియల్ లైఫ్‌లోనూ పైలట్టే. ఇండిగో సర్వీసులో పైలట్ గా సేవలు అందిస్తున్నారు వర్ష. ఆమె భర్త లోగేశ్ ఎయిరిండియాలో పైలట్. డైరక్టర్ సుధా కొంగర ప్రత్యేక ఇన్విటేషన్ కోసం ఈ సినిమాలో పైలట్ గా కనిపించారు వర్షా.



కేరళ వాసి అయిన వర్షా చెన్నైలో ఉంటున్నారు. క్లైమాక్స్ లో ఆమెను చూసిన వారంతా వర్షాకు అభిమానులు అయిపోయారు. చెక్ చేసి నిజంగా పైలట్ అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారంతా.


https://10tv.in/aakaasam-nee-haddhu-ra-movie-review/
లో బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ డెక్కన్.. ఫౌండర్ కెప్టెన్ జీఆర్. గోపీనాథ్ ఆటో బయోగ్రఫీ సింప్లీ ఫ్లై ఆధారంగా ఈ సినిమాను రెడీ చేశారు. ఇదంతా సినిమా చివర్లో చూపిస్తున్నారు. సూర్య కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా ఉండిపోతుందని విమర్శకులు, అభిమానుల నుంచి పొగడ్తలు కురుస్తున్నాయి.