Pushpa 2 Collections : పుష్ప 2 హిందీ కలెక్షన్స్ రప్పారప్పా.. ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…

కేవలం విడుదలైన 4 రోజుల్లోనే 829 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2.

Fifth Day Allu Arjun Pushpa 2 movie Hindi Collections

Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయంతో దూసుకుపోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

Also Read : Pushpa 2 Collections : వెయ్యి కోట్ల దిశగా అల్లు అర్జున్ పుష్ప 2.. రికార్డు బ్రేక్ చేస్తుందా..

కేవలం విడుదలైన 4 రోజుల్లోనే 829 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2. అయితే పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. అందుకే ముందు నుండే పుష్ప పై భారీ అంచనాలు ఉండడంతో తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సత్తా చాటుతుంది. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. తెలుగుతో సమానంగా పుష్ప 2 హిందీ కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పుష్ప 2 ఐదవ రోజు హిందీ కలెక్షన్స్ ఎంతో ఓ పోస్ట్ షేర్ చేశారు మేకర్స్.


అయితే ఐదవ రోజు హిందీలో 48 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మొదటి రోజు 72 కోట్లు, రెండో రోజు 59 కోట్లు, మూడవ రోజు 74 కోట్లు, నాలుగవ రోజు 86 కోట్లు, ఇక ఈరోజు 48 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. ఓవర్ ఆల్ గా ఐదు రోజులు కలిపి 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి రెకార్డుకెక్కింది పుష్ప 2. ఇక హిందీలో ఇప్పటికే షారుక్ వంటి పలు హీరోల సినిమా ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన పుష్ప ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే 339 కోట్ల నెట్ వసూలు చేసింది.