Pushpa 2 Collections : వెయ్యి కోట్ల దిశగా అల్లు అర్జున్ పుష్ప 2.. రికార్డు బ్రేక్ చేస్తుందా..

పుష్ప 2 విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.

Pushpa 2 Collections : వెయ్యి కోట్ల దిశగా అల్లు అర్జున్ పుష్ప 2.. రికార్డు బ్రేక్ చేస్తుందా..

Pushpa 2 Box Office Collections Shakes Tollywood

Updated On : December 10, 2024 / 2:26 PM IST

Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంటుంది. కోటానుకోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే పుష్ప 2 కి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

అయితే పుష్ప 2 విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమాల కలెక్షన్స్ కూడా క్రాస్ చేసింది పుష్ప 2.  భారీ వసూళ్లు అందుకుంటున్న ఈ సినిమా వెయ్యి కోట్లకి ఇంకాస్త దూరంలో ఉంది. కేవలం 4 రోజుల్లోనే 829 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఐదవ రోజు ముగిసే సరికి వెయ్యి కోట్లు అందుకుంటుందని అంటున్నారు. ఐదవ రోజు కలెక్షన్స్ తెలిస్తే పుష్ప 2 వెయ్యి కోట్లు ఎప్పటికి వసూలు చేస్తుందో తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా పుష్ప 2 వెయ్యి కోట్ల కలెక్ట్ చెయ్యడం ఖాయమంటున్నారు ఫాన్స్.

Also Read : Manchu Manoj : ఆస్తి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం.. మంచు వార్ పై మనోజ్ కామెంట్స్..

ఇక ఆదివారం వీక్ ఎండ్ కావడంతో భారీ ఎత్తున జనాలు పుష్ప 2 చూడడానికి థియేటర్స్ ముందు క్యూ కట్టారు. శని, ఆదివారాల్లో పుష్ప 2 కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కేవలం తెలుగులోనే కాదు మిగిన భాషల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా వీక్ డేస్ సోమవారం, మంగళవారం కూడా మంచి కలెక్షాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది పుష్ప 2. మరి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి పుష్ప 2 చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.