Manchu Manoj : ఆస్తి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం.. మంచు వార్ పై మనోజ్ కామెంట్స్..
మంచు కుటుంబంలో కొనసాగుతున్న హైడ్రామా గురించి తెలిసిందే. తాజాగా దీని గురించి మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చాడు మంచు మనోజ్.

Manchu Manoj First Reaction on Family Issue
Manchu Manoj : మంచు కుటుంబంలో కొనసాగుతున్న హైడ్రామా గురించి తెలిసిందే. తాజాగా దీని గురించి మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చాడు మంచు మనోజ్. ఇక మీడియాతో మాట్లాడుతూ..’ డబ్బు కోసమో, ఆస్థి కోసమో నేను ఈ పోరాటం చెయ్యడం లేదని తెలిపారు. తనను తొక్కేయడానికి తన భార్య పిల్లల్ని మధ్యలోకి లాగుతున్నారని మీడియా ముఖంగా తెలిపారు. నేను చేస్తుంది ఆత్మ గౌరవ పోరాటమని, ఇది నా భార్య పిల్లల రక్షణ కోసమని తెలిపాడు.
Also Read : Vishnu Manchu : మంచు ఫ్యామిలీలో ముదురుతున్న వివాదం.. దుబాయ్ నుండి వచ్చిన విష్ణు ఏం చెప్పాడు..
అంతేకాదు.. నన్ను కిందికి తొక్కేయడానికి నా భార్యను బెదిరిస్తున్నారని తెలిపాడు. నా ఏడు నెలల పాపను, పిల్లలను ఈ గొడవలోకి లాగడం అసలు కరెక్ట్ కాదని, నా పిల్లల ముందే ఇలా చెయ్యడంతో రక్షణ కోసం పోలీసులను రక్షణ కల్పించమని కోరానని, కానీ నా మనుషులను బెదిరించి మరీ వేరేవాళ్లని నా ఇంట్లోకి పంపించారు. ఇలా చెయ్యడానికి పోలీసులకి ఎవరు అధికారం ఇచ్చారని తెలిపారు. దీనికోసం ఎక్కడిదాకన్నా వెళ్తా అని, న్యాయం కోసం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని కలుస్తా అని తెలిపాడు.
ఇక మంచు ఫ్యామిలిలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఇవాళ దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు విష్ణు. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరుగుతున్న వివాదం పై విష్ణు సైతం మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చాడు. ఇవి ఫ్యామిలీ గొడవలని పరిష్కరించబడుతాయని, దీనిని పెద్ద ఇష్యు చెయ్యకండని తెలిపారు.