Celebrities Tribute to Vijayakanth : గొప్ప మానవతావాదిని కోల్పోయాం.. చిరంజీవి, మోడీతో సహా విజయ్‌కాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

విజయ్‌కాంత్ సినిమాల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. విజయ్‌కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని తల్చుకుంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.

Celebrities Tribute to Vijay Kanth

Celebrities Tribute to Vijayakanth : విజయ్‌కాంత్ మరణంపై ఇటు సినీ.. అటు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ సోషల్ మీడియాలో విజయ్‌కాంత్‌కు ఘన నివాళులు అర్పించారు.

Sonu Sood : సోనూసూద్ ఫస్ట్ సినిమా హీరో విజయ్‌కాంత్‌ అని తెలుసా? కెప్టెన్ మరణంపై సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్..

విజయ్‌కాంత్‌ ఇటు సినిమా రంగంతో పాటు.. అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. రాజకీయాల్లోకి రాక ముందు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేసారు. ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో అనువాదం అయ్యాయి. 20 సినిమాల్లో పోలీసు పాత్రల్లో నటించారు. ఇలా ఏ భాషా నటుడు చేసి ఉండకపోవడం విశేషం. 40 సంవత్సరాలకు పైగానే సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ DMDK (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) స్ధాపించి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విజయ్ కాంత్ 71 ఏళ్ల వయసులో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Viajayakanth Family : విజయ్‌కాంత్‌ కన్నుమూత.. కుటుంబ నేపథ్యం.. కుమారుడు కూడా నటుడే..

విజయ్‌కాంత్‌‌కు ఇటు సినిమా అటు రాజకీయ రంగాలకు సంబంధించి అనేకమంది ప్రముఖులతో అనుబంధం ఉంది. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. విజయ్‌కాంత్ మరణంపై అనేకమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ, చిరంజీవి, కమల్ హాసన్, శరత్ కుమార్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రవి తేజ, నారా లోకేష్, మంచు విష్ణు, సోనూ సూద్, విశాల్,  సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

 

ట్రెండింగ్ వార్తలు