Sonu Sood : సోనూసూద్ ఫస్ట్ సినిమా హీరో విజయ్‌కాంత్‌ అని తెలుసా? కెప్టెన్ మరణంపై సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్..

విజయ్‌కాంత్ మరణంపై ప్రముఖ సెలబ్రిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు.

Sonu Sood : సోనూసూద్ ఫస్ట్ సినిమా హీరో విజయ్‌కాంత్‌ అని తెలుసా? కెప్టెన్ మరణంపై సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్..

Sonu Sood

Updated On : December 28, 2023 / 12:13 PM IST

Sonu Sood : ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ మరణంపై అన్ని భాషల సినీ పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసాయి. పలువురు ప్రముఖ నటులు విజయ్‌కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Viajayakanth Family : విజయ్‌కాంత్‌ కన్నుమూత.. కుటుంబ నేపథ్యం.. కుమారుడు కూడా నటుడే..

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 40 సంవత్సరాలపాటు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్‌కాంత్. ఆయన మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేసారు. నటుడు సోనూ సూద్ విజయ్‌కాంత్ మరణంపై సంతాపం తెలిపారు. ట్విట్టర్‌లో విజయ్‌కాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Captain Vijayakanth : కెప్టెన్ విజయ్‌కాంత్‌ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీస్ పాత్రలు.. ఒకే సంవత్సరం 18 సినిమాలు.. 150కి పైగా సినిమాలు..

‘కలైంజ్ఞర్’.. నా మొదటి సినిమా విజయ్‌కాంత్ సార్ నాకు ఇచ్చిన బహుమతి.. ఆయన నా స్టిల్ చూసారు.. కానీ నేను కన్నుమూసి తెరిచేలోపు నేను ఆయనతో సినిమా చేయడం  గొప్ప అనుభూతి.. నేను నా కెరియర్ మొత్తం ఆయనకు రుణపడి ఉంటాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను.. రిప్ కెప్టెన్’ అంటూ సోనూ సూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. సోనూ సూద్ ఫస్ట్ మూవీ ‘కలైంజ్ఞర్’. విజయ్ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా 1999 లో విడుదలైంది. ఇందులో సోనూ సూద్ సౌమ్య నారాయణన్ అనే పూజారి పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత సోనూ సూద్ బిజీ నటుడు అయిపోయారు.