Captain Vijayakanth : కెప్టెన్ విజయ్‌కాంత్‌ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీస్ పాత్రలు.. ఒకే సంవత్సరం 18 సినిమాలు.. 150కి పైగా సినిమాలు..

విజయ్‌కాంత్‌ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Captain Vijayakanth : కెప్టెన్ విజయ్‌కాంత్‌ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీస్ పాత్రలు.. ఒకే సంవత్సరం 18 సినిమాలు.. 150కి పైగా సినిమాలు..

Actor Politician Captain Vijayakanth Film Journey full Details

Captain Vijayakanth : ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చికిత్స అందుకుంటూ నేడు ఉదయం చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. విజయ్‌కాంత్‌ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

విజయ్‌కాంత్‌ 1979లో తమిళ్ సినిమా ఇనిక్కుమ్ ఇలామై అనే సినిమాతో నెగిటివ్ రోల్ లో పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నెగిటివ్, చిన్న పాత్రలు చేసిన విజయ్‌కాంత్‌ ‘దూరతు ఇడి ముళక్కం’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత వచ్చిన సత్తం ఓరు ఇరుత్తరై సినిమా భారీ హిట్ కొట్టి విజయ్‌కాంత్‌ ని హీరోగా నిలబెట్టింది. ఇక అప్పట్నుంచి హీరోగా వరుస సినిమాలు చేశారు. మొదట్లో ఎక్కువగా విప్లవ భావాలు ఉన్న సినిమాలు చేసిన విజయ్‌కాంత్‌ ఆ తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మారిపోయారు.

విజయ్‌కాంత్‌ ఎక్కువగా పోలీస్, ఆర్మీ, లీడర్ పాత్రల్లో నటించారు. దాదాపు 20కి పైగా సినిమాల్లో విజయ్‌కాంత్‌ పోలీస్ పాత్రల్లో నటించారు. కెరీర్ ఊపందుకున్నాక రోజుకి మూడు షిఫ్టుల్లో వరుస సినిమాలు చేశారు. సంవత్సరానికి 10కి పైగా సినిమాలు రిలీజ్ చేసేవారు. 1984 లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సెట్ చేశారు విజయ్‌కాంత్‌. ఆ తర్వాత సంవత్సరం 1985కి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ చేశారు. తమిళ్ లో ఒకానొక టైంలో రజినీకాంత్, కమల్ హాసన్ కి పోటీ ఇచ్చారు.

Also Read : Vijayakanth Rare Photos : కెప్టెన్ విజయకాంత్ రేర్ ఫొటోలు చూశారా?

ఇక విజయ్‌కాంత్‌ ఎంత కమర్షియల్ సినిమాలు చేసినా అందులో ఏదో ఒక మెసేజ్ ఉండేలా ఆచూసుకునేవారు. అందుకే ఆయన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో విజయ్‌కాంత్‌ నటించారు. దర్శకుడిగా విరుదగిరి అనే ఓ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. కెరీర్లో ఓ సమయంలో వరుస ఫ్లాప్స్ వచ్చినా ఆయన కెప్టెన్ ఇమేజ్ ని మాత్రం అలాగే కాపాడుకున్నారు. హీరోగా అవకాశాలు తగ్గాక తండ్రి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు విజయ్‌కాంత్. ఇక విజయ్‌కాంత్‌ నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయి హిట్ అయ్యాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

Also Read : విజయ్‌కాంత్‌కి ‘కెప్టెన్’ బిరుదు ఎలా వచ్చింది..? రోజా భర్త వల్లే..