Film Federation of India Announced 2018 Movie is Official entry for Oscar 2024 from India
2018 Movie : సినిమా వాళ్లందరికీ ఆస్కార్ (Oscar) ఓ కల. కనీసం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లోకి అయినా స్థానం సాధించాలని చాలా సినిమాలు కలగంటాయి. అలాగే ప్రతి దేశం అధికారికంగా ఒక సినిమాని దేశం తరపున ఆస్కార్ కి పంపిస్తుంది. గత సంవత్సరం గుజరాతి సినిమా లాస్ట్ ఫిలిం షో ని పంపించారు. ఈసారి కూడా అనేక సినిమాలు పోటీ పడగా ఇండియా నుంచి ఆస్కార్ కు ‘2018’ సినిమా అధికారిక ఎంట్రీ సాధించింది. ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా (Film Federation of India) ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది.
ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్, లాల్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా ‘2018-ఎవరీ వన్ ఈజ్ హీరో’. కేరళలో 2018 సంవత్సరంలో భారీగా వరదలు రాగా అక్కడ సంభవించిన నష్టాలు, మరణాలు, మనుషులు తమంతట తాము ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయడం, మనుషులని మనుషులే ఎలా రక్షించారు అనే మానవతా కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.
2018 సినిమా చాలా చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది. తక్కువ రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా 2018 నిలిచింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన తర్వాత వేరే భాషల్లో కూడా డబ్ అయి అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పటికే పలు అవార్డులు సాధించగా 2018 సినిమా ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది.
Also Read : సాయి రామ్ శంకర్ గ్రాండ్ రీ ఎంట్రీ.. పండక్కి ముందే దరువేస్తానంటున్న పూరి తమ్ముడు..
మరి 2018 సినిమా ఆస్కార్ సాధిస్తుందా చూడాలి. రాజమౌళి RRR సినిమాలో నాటు నాటు బెస్ట్ సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకొని ఇండియన్ సినిమాలకు ఆస్కార్ మీద మరిన్ని ఆశలు పెంచింది. ఈసారి అధికారికంగా కాకుండా ఇంకెన్ని సినిమాలు ఆస్కార్ కు వెళ్ళడానికి ట్రై చేస్తాయో చూడాలి.
The film “2018-Everyone is a Hero” represents India and the theme of the film is calamity humans face: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 27, 2023