Chiranjeevi: సినీ కళాకారులు కాదు.. సినీ కళా కార్మికులు: మేడేలో మెగాస్టార్

మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi: మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకి చెందిన వేలాది కార్మికులు పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Talasani Srinivas Yadav : తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవే.. సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్..

ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి.. సినీ కార్మికులందరు చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. నాకు తెలుసు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు.. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు.. ఇలాంటి సినీ కార్మికోత్సవాలు నిరంతరం జరగాలి, కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది అని వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వలెనే ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదు. ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకుని వచ్చాను. నేను కూడా కార్మికుడునే.

Kishan Reddy : ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమాని పొగిడారు.. చిరంజీవి పిలిచారనే వచ్చాను..

అయితే.. బయటి కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుంది. బయటి కార్మికులకు నిర్ణీతమైన సమయం, వాతావరణం ఉంటుంది. సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం అంటూ ఉండదు. సినీ కార్మికులకు పండుగలు, పబ్బాలు, ఆదివారాలు ఉండవు. సినీ కళాకారులు కాదు.. సినీ కళా కార్మికులు అనేవారు రావుగోపాల్ రావు. షూటింగ్ లో వైర్లు తెగి కారు ప్రమాదంలో నూతన ప్రసాద్ గాయపడ్డారు. గాయపడ్డా కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్ ఇచ్చిన వ్యక్తి నూతన ప్రసాద్. సినీ పరిశ్రమకు నూతన ప్రసాద్ చేసిన త్యాగం ఎప్పటికి మరిచిపోలేను. సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని నవ్వులు పంచారు అల్లు రామలింగయ్య.

Chiranjeevi : చిరంజీవి గారు పిలిచారు.. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్.. ‘ఆచార్య’తో రోజా మీటింగ్..

ఎన్నో బాధలను దిగమింగుకొని సినిమా కోసం కార్మికులు పనిచేస్తారు. సినీ కార్మికుల జీవితాలకు ఇక్కడ భరోసా లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సమయంలో 103 జ్వరంతో బాధపడుతూ శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేసిన నేను.. గాడ్ ఫాదర్ కోసం ముంబయి, మైత్రీ మూవీ కోసం హైదరాబాద్ తిరిగే సమయంలో బాగా నీరసంగా ఉన్నా పనిచేయాల్సిన పరిస్థితి. నేను డల్ గా ఉన్నానని చెబితే షూటింగ్ ఆగిపోయేది. కానీ ఆ పనిచేయలేని పరిస్థితి. కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించా. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. చిరంజీవి కార్మికుల వెంటే ఉంటాడు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారని చిరంజీవి చెప్పారు.

Chiranjeevi: సినీ అవార్డులపై ప్రభుత్వాలు పునరాలోచించాలి: చిరంజీవి

సినీ ఇండస్ట్రీ సజావుగా సాగడానికి అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి చెడదానికి కచ్చితంగా ప్రభుత్వ సహకారాలు కావాలి. క్రైసిస్ వచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట, ఒక పిలుపుతో స్పందించిన తీరు కానీ అందించిన చేయూత కానీ నభూతో నభవిష్యతి. ఈరోజు ప్రతి సినిమా ట్రిపుల్ ఆర్ కానీ కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలు అత్యద్భుత కలెక్షన్స్ తో ఆడుతున్నాయి.. రెవిన్యూ వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇచ్చిన భరోసా వాళ్ళు కురిపించిన వారాలు. సిని ఇండస్ట్రీకి ఏ అవసరం వచ్చినా మీ అండదండలు కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి.. వారు ఇచ్చిన వరాలకు, చల్లని చూపుకు ఇండస్ట్రీ తరుపు నుంచి నా ధన్య వాదములు అని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు