Kishan Reddy : ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమాని పొగిడారు.. చిరంజీవి పిలిచారనే వచ్చాను..

కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. నేను కూడా సినిమాలు చూస్తాను. ఇటీవల............

Kishan Reddy : ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమాని పొగిడారు.. చిరంజీవి పిలిచారనే వచ్చాను..

Kishan Reddi

Kishan Reddy :  ఇవాళ మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తదితర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకి చెందిన వేలాది కార్మికులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ”తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. నేను కూడా సినిమాలు చూస్తాను. ఇటీవల రిలీజైన మన సినిమాలన్నీ పెద్ద విజయం సాధించాయి. తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక దర్శక నిర్మాతలు, నటీనటులతోపాటు కార్మికుల కృషి ఉంది. ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారు. అంత గుర్తింపు వచ్చింది మన సినిమాలకి. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారు. సినీ రంగంలోని 24 విభాగాలు కరోనా వల్ల చాలా ఇబ్బందిపడ్డారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయి. వ్యాక్సిన్ రావడం వల్ల మళ్లీ పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయి” అని అన్నారు.

Talasani Srinivas Yadav : తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవే.. సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్..

 

ఇక కార్మికుల గురించి మాట్లాడుతూ.. ”కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ బోర్డు చట్టం సినీ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది. పీఎఫ్ పరిధిలో 6 కోట్ల మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సహా అనేక సౌకర్యాలు నూతన చట్టం ద్వారా వర్తిస్తాయి. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఈ చట్టానికి ఆమోదం లభించింది. ఈ-శ్రమ కార్డును కార్మికులందరు తీసుకోవాలి. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ కార్డులను పంపిణీ చేశాం. ఈ-శ్రమ కార్డు ఉన్న కార్మికులకు ప్రమాద బీమా కూడా ప్రభుత్వం అందిస్తుంది. మిత్రులు మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానంతో సినీ కార్మికోత్సవానికి హాజరయ్యాను” అని తెలిపారు.