Talasani Srinivas Yadav : తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవే.. సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్..

మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ''తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నది.............

Talasani Srinivas Yadav : తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవే.. సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్..

Talasani

Talasani Srinivas Yadav :  ఇవాళ మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకి చెందిన వేలాది కార్మికులు పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. ”మేడే వచ్చిదంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుంది. సినీ పరిశ్రమలో 24 విభాగాలకు సంబంధించిన లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. వారంతా రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. కరోనా కాలంలో షూటింగ్స్ లేక చాలా ఇబ్బందిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. యూసఫ్ గూడ, కృష్ణానగర్, కార్మికనగర్, చిత్రపురిలో వేలాది మంది సినీ కార్మికులు జీవిస్తున్నారు. కార్మిక శాఖ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్మికులకు కావాల్సిన సంక్షేమ పథకాలను త్వరలో అమలు చేస్తాం. ఇళ్లు లేని సినీ కార్మికులకు రాబోయే కాలంలో చిత్రపురిలో ఇళ్లు కట్టిస్తాం. తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల వెంట ఎప్పుడూ ఉంటుంది” అని అన్నారు.

Maa Palle Charitable Trust : దిల్‌రాజు ట్రస్ట్.. రైతుల కోసం.. దేవుడి కోసం..

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ”తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నది చిరంజీవి ఆకాంక్ష. చిరంజీవి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవి గారు పెద్ద ఆస్పత్రి కట్టాలనే సంకల్పంతో ఉన్నారు. చిత్రపురిలోని పాఠశాల, ఆస్పత్రికి కావల్సిన స్థలం ఉంది. చిరంజీవి గారు చిత్రపురి స్థలంలో ఆస్పత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగపడుతుంది” అని తెలిపారు.