Telugu Film Chamber : హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫైర్ యాక్సిడెంట్.. మంటల్లో భవనం..

హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్ భవనం అంతా..

fire accident takes place at Telugu Film Chamber office hyderabad

Tollywood : హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ సముదాయంలో ఉన్న స్వరుచి రెస్టారెంట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కరెంటు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మంటలు చెలరేగి ఫిలిం ఛాంబర్ భవనం అంతా వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్న మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read : Vijay : రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్.. ఆ సినిమాకి అన్ని కోట్లా..!

కాగా ఈ ప్రమాదంలో ఎవరికైన గాయాలు అయ్యాయా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా వీస్తున్నాయి. బగబగ మండే సూర్యుడికి మనుషులతో పాటు ఎలక్ట్రిక్ పరికరాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదానికి కూడా ఆ ఎండలే కారణమే అని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల పై ఫిలిం ఛాంబర్ ప్రతినిథులు స్పందిస్తారేమో చూడాలి.