Vijay : రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్.. ఆ సినిమాకి అన్ని కోట్లా..!

రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్. లియో సక్సెస్ తో పారితోషకం..

Vijay : రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్.. ఆ సినిమాకి అన్ని కోట్లా..!

Vijay charge remuneration more than rajinikanth

Vijay : ప్రస్తుతం సౌత్ సినిమాల బడ్జెట్స్ అండ్ కలెక్షన్స్ మాత్రమే కాదు, హీరోల రెమ్యూనరేషన్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఒకర్ని మించి మరొకరు పారితోషకం తీసుకుంటూ నేనే నెంబర్ వన్ అనిపించుకునేలా చేస్తున్నారు. ఇటీవల జైలర్ సినిమాకి రజినీకాంత్ భారీ పారితోషకం అందుకున్న సంగతి తెలిసిందే. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జైలర్ సినిమాకు గాను రజిని.. దాదాపు 210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు దళపతి విజయ్, రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇటీవల విజయ్ నటించిన ‘లియో’ సినిమా కూడా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. దీంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు సమాచారం. తన 69వ సినిమాకి విజయ్ ఏకంగా రూ.250 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ ఇండస్ట్రీలోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్.

Also read : Ranveer Singh : మీ స్టార్‌డమ్ ఏంటి.. మీరు చేసే యాడ్స్ ఏంటి.. జానీ సిన్స్‌తో రణ్‌వీర్ కొత్త యాడ్ చూశారా..

ఈ 69వ చిత్రాన్ని హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుందట. మరి ఈ సినిమాకి విజయ్ తీసుకుంటున్న భారీ రెమ్యూనరేషన్ లో ఎంత నిజముందో తెలియదు. ప్రస్తుతం ఈ 250 కోట్ల పారితోషకం వార్త వైరల్ గా మారింది.

కాగా విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే.. ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.