Virat Kohli-Anushka Sharma :పెళ్లయిన మొదటి 6 నెలల్లో.. 21 రోజులు మాత్రమే కలిసున్నాం..

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్నేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ కి ఒక పాప, ఒక బాబు. తమ ఇద్దరి పిల్లలతో హ్యాపీ గా ఉన్నారు ఈ జంట.

Virat Kohli-Anushka Sharma :పెళ్లయిన మొదటి 6 నెలల్లో.. 21 రోజులు మాత్రమే కలిసున్నాం..

first 6 months of marriage..we met only for 21 days Anushka Sharma comments on Virat Kohli

Updated On : November 15, 2024 / 3:16 PM IST

Virat Kohli-Anushka Sharma : స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్నేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ కి ఒక పాప, ఒక బాబు. తమ ఇద్దరి పిల్లలతో హ్యాపీ గా ఉన్నారు ఈ జంట.

అయితే విరాట్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల.. పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉంది.. విరాట్ తో పెళ్లి తర్వాత గడిపిన సమయం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” నేను లేదా విరాట్ ఒకరినొకరు కలిసి ఎక్కడన్నా బయట కనిపిస్తే.. మేము హాలీడే ఎంజాయ్ చేస్తున్నామనుకుంటారు. కానీ అందులో అస్సలు నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : Tollywood Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..

అంతేకాకుండా..“వాస్తవానికి, మా పెళ్లయిన మొదటి ఆరునెలల్లో మేము కలిసి ఉన్నది కేవలం 21 రోజులు మాత్రమే అని, అందుకే విరాట్ ఏ దేశంలో ఉంటే నేను కూడా అక్కడికే వచ్చి కలుస్తుంటానని.. అలా కలిసినప్పుడు ఇద్దరం కలిసి భోజనం చేస్తామని, దాన్ని చూసి చాలా మంది మాకు సెలవు దొరికి ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నారని” అనుష్క తెలిపించి.