ఆది పినిశెట్టి ‘క్లాప్’ – ఫస్ట్ లుక్
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ (మళ్లీరావా ఫేమ్) జంటగా నటిస్తున్న సినిమా.. ‘క్లాప్’.. (ది సౌండ్ ఆఫ్ సక్సెస్).. ఫస్ట్ లుక్ రిలీజ్..

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ (మళ్లీరావా ఫేమ్) జంటగా నటిస్తున్న సినిమా.. ‘క్లాప్’.. (ది సౌండ్ ఆఫ్ సక్సెస్).. ఫస్ట్ లుక్ రిలీజ్..
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ (మళ్లీరావా ఫేమ్) జంటగా నటిస్తున్న సినిమా.. ‘క్లాప్’.. (ది సౌండ్ ఆఫ్ సక్సెస్).. క్రిషా కురుప్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దీపావళి సందర్భంగా.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో బిగ్ ప్రింట్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. పృథ్వీ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు.
ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆది ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించనున్నాడు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మధురై వంటి ప్రాంతాలలో కేవలం నాలుగు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేయనున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మైమ్ గోపి, సూర్య, మీనా, వాసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : ‘ఆవిరి’ సెన్సార్ పూర్తి : నవంబర్ 1 విడుదల
రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ : ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కుమార్, ఎడిటింగ్ : రగుల్.
Here is the Futuristic First Look of #Clap !
Interesting & Innovative One 🙂 #ClapFirstLook” A Maestro #Ilayaraaja Musical “@AadhiOfficial @prithivifilmist @BigPrintOffl | @aakanksha_s30 @Kurupkrisha @pravethedop @Donechannel1 @shiyamjack | pic.twitter.com/PI2dzU6fdm
— Bigprint Pictures (@BigPrintoffl) October 26, 2019