సాండ్ కి ఆంఖ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
తాప్సీ, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. సాండ్ కి ఆంఖ్.. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మాతలు. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్‌గా సాండ్ కి ఆంఖ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. తాప్సీ, భూమి ఇద్దరూ చేతిలో గన్స్ పట్టుకుని, ఓల్డ్ గెటప్‌లో ఉన్నారు.. 87 ఏళ్ళ చంద్రో తోమర్‌గా తాప్సీ, 82 ఏళ్ళ ప్రకాషీ తోమర్‌గా భూమి నటిస్తున్నారు. వీరిద్దరూ మేకప్ పరంగా బాగా శ్రద్ధ తీసుకున్నారు.
60 ఏళ్ళ వయసులో షూటర్స్ అయ్యి, దాదాపు ఏడు వందల పతకాలు సాధించి, ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించి, ఎందరికో ఆదర్శంగామారి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు చంద్రో, ప్రకాషీ తోమర్.. ప్రకాష్ ఝా, విక్కీ కడియన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. 2019 దీపావళికి సాండ్ కి ఆంఖ్ రిలీజ్ కానుంది.