విఠల్‌వాడి – ఫస్ట్ లుక్

జగపతిబాబు చేతుల మీదుగా 'విఠల్‌వాడి' (ఏ గల్లీ లవ్ స్టోరీ).. ఫస్ట్ లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : September 23, 2019 / 06:13 AM IST
విఠల్‌వాడి – ఫస్ట్ లుక్

Updated On : September 23, 2019 / 6:13 AM IST

జగపతిబాబు చేతుల మీదుగా ‘విఠల్‌వాడి’ (ఏ గల్లీ లవ్ స్టోరీ).. ఫస్ట్ లుక్ విడుదల..

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. కంటెంట్ నచ్చితే హీరో ఎవరు ఏంటనేది చూడకుండా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పుడు మంచి కంటెంట్‌తో ‘విఠల్‌వాడి’ (ఏ గల్లీ లవ్ స్టోరీ) అనే సినిమా రూపొందుతుంది.

మెట్టు రోహిత్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నాడు. సుధ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతుంది. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ జగపతిబాబు చేతుల మీదుగా విడుదలైంది. గల్లీ నేపథ్యంలో లవ్ స్టోరీగా రూపొందుతున్న విఠల్‌వాడి చిత్రాన్ని జి.నరేష్ రెడ్డి నిర్మిస్తుండగా, టి.నాగేందర్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

Read Also : జనవరి 12న అల… వైకుంఠపురములో…

కోటి తనయుడు రోషన్ సాలూర్ సంగీతమందిస్తున్నాడు. కెమెరా : సతీష్ అడపా, ఎడిటింగ్ : శ్రీనివాస్ మోపర్తి.