Flora Saini says dating is better than getting married
Flora Saini: ఫ్లోరా సైనీ.. అంటే చాలా మందికి గుర్తురాకపోవచ్చు. కానీ, నరసింహనాయుడు సినిమాలో “లక్స్ పాప” అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి ఆమె మనకు తెలిసింది ఆశ సైనీలా. కానీ, ఈ మధ్యే ఆమె ఫ్లోరా సైనీగా పేరు మార్చుకుంది. తెలుగులో అడపాదడపా కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇక చాలా కాలం తరువాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టింది. ఈమధ్యే ఎలిమినేట్ కూడా(Flora Saini) అయ్యింది. ఉన్నంతకాలం కూడా ఎవరి కనిపించలేదు. ఆటతో గానీ, మాటతో గానీ మెప్పించలేదు. అందుకే, ఆడియన్స్ కూడా ఆమెను ఎక్కువకాలం భరించలేకపోయారు. బయటకు పంపించేశారు.
ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫ్లోరా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కంటే డేటింగ్ బెటర్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. పెళ్లి చేసుకున్న నా ఫ్రెండ్స్ ను చాలా మందిని చూశాను. కేవలం రెండు, మూడేళ్లకే డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు. పెళ్లి అంటే నా దృష్టిలో ఒక అనవసర రిలేషన్. అందుకే నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ పోయింది. ప్రెజెంట్ నేను ఒక వ్యక్తితో డీప్ డేటింగ్ లో ఉన్నాను. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్లి తరువాత విడిపోవడం కంటే.. డేటింగ్ చేస్తూ తో లైఫ్ ఎంజాయ్ చేయడం బెటర్. అందుకే, పెళ్లి వద్దని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆమె కామెంట్స్ నీ యాక్సప్ట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.