Folk Singer Sharda Sinha Known For iconic Chhath Songs Dies at 72
Sharda Sinha : ప్రముఖ జానపద గాయని, పద్మ భూషణ్ శారదా సిన్హా (72) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడటంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. బీహార్ జానపద కళలకు గాయని శారదా సిన్హా జీవం పోశారు.
బీహార్ సంస్కృతి, సంప్రదాయాలను ఫోక్ సాంగ్స్‌తో కళ్లకు కట్టినట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా శారదా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Read Also : Boxer Imane Khelif : బాక్సర్ ఇమాన్ ఖలీఫా మహిళ కాదు.. పురుషుడే.. మెడికల్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు..!