Boxer Imane Khelif : బాక్సర్ ఇమాన్ ఖలీఫా మహిళ కాదు.. పురుషుడే.. మెడికల్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు..!
ఇమాన్ వెయిట్ విభాగంలో అల్జీరియాకు బంగారు పతకాన్ని సాధించాడు. ఓ మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Algerian Olympic gold medalist boxer Imane Khelif
Boxer Imane Khelif : అతడు ఆమె కాదు.. అతడే.. అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ కేసులో షాకింగ్ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకం సాధించిన అల్జీరియా బాక్సర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడు పురుషుడిగా మహిళల ఈవెంట్‌లలో పాల్గొనడంతో ఈ వివాదం మొదలైంది. అయితే, మహిళగా చెప్పుకోవడంతో ఒలింపిక్ కమిటీ బాక్సర్‌కు ఆడేందుకు అవకాశం ఇచ్చింది.
ఇమాన్ తన వెయిట్ విభాగంలో అల్జీరియాకు బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ఇప్పుడు ఓ మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమానే ఖేలిఫ్ మహిళ కాదని, నిజానికి పురుషుడని వెల్లడించింది. ఇమాన్‌కు ఖేలిఫ్‌కు గర్భాశయం లేదని, అంతర్గత వృషణాలను కలిగి ఉన్నాడని మెడికల్ రిపోర్ట్ వెల్లడించింది. కొన్ని నెలల క్రితం, పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో ఖలీఫ్ బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని క్రెమ్లిన్-బిస్సెట్రా హాస్పిటల్, అల్జీరియాలోని అల్జీర్స్‌లోని మహ్మద్ లామిన్ డెబాఘీన్ హాస్పిటల్‌తో కలిసి జూన్ 2023లో నివేదిక తయారు చేసింది. నిపుణులైన ఎండోక్రినాలజిస్టులు సుమైయా ఫెడలా, జాక్వెస్ యంగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఖలీఫ్ 5-ఆల్ఫా రిడక్టేజ్ లోపంతో బాధపడుతున్నాడని, లైంగిక అభివృద్ధిలో రుగ్మత, జీవసంబంధమైన మగవారిలో మాత్రమే కనిపిస్తుంది.
ఇమానే ఖెలిఫ్ మెడికల్ రిపోర్టులో అనేక పరీక్షలు ఉన్నాయి. ఖలీఫ్ లైంగిక అభివృద్ధి రుగ్మత లక్షణాలను కలిగినట్టు నివేదిక సూచించింది. ఎంఆర్ఐ రిపోర్టులో ఖేలిఫ్‌కు గర్భాశయం లేదని, అంతర్గత వృషణాలను ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ రిపోర్ట్ వైరల్ కావడంతో మహిళగా చెప్పకుని ఒలింపిక్స్ లో పతకం సాధించిన తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రిపోర్టు ఆదారంగా ఒలిపింక్స్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.