Kurchi Madathapetti Song : కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌తో.. ఫారినర్స్ జిమ్ వర్క్ అవుట్స్..

కొంతమంది ఫారినర్స్ కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌తో జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. వీడియో మాత్రం సూపర్ ఉంది.

foreigners gym work outs by Kurchi Madathapetti Song video gone viral

Kurchi Madathapetti Song : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’.. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం.. అదిరిపోయే వ్యూస్ రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీలోని మాస్ సూపర్ హిట్ సాంగ్ ‘కుర్చీ మ‌డ‌త పెట్టి’.. ఎంతటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నుంచి అలాంటి మాస్ సాంగ్ ని ఎవరు అంచనా వేయలేదు. దీంతో సాంగ్ రిలీజ్ అవ్వడంతోనే.. భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక ఆ సాంగ్ కి మహేష్, శ్రీలీలతో కలిసి వేసిన స్టెప్పులకి బాక్స్ ఆఫీస్ బద్దలు అయ్యిపోయింది.

Also read : Mahesh Babu – Suma Kanakala : మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

ఈ మాస్ సాంగ్ ప్రతి ఒక్కరిలో జోష్ ని నింపుతూ అందరికి ఉత్సాహాన్ని ఇస్తుంది. దీంతో కొంతమంది ఈ పాటని జిమ్ వర్క్ అవుట్స్ కోసం ఉపయోగించేసుకుంటున్నారు. కొంతమంది ఫారినర్స్ కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌తో జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. వీడియో మాత్రం సూపర్ ఉంది. ఇక ఈ వీడియోని మహేష్ బాబు కూడా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం విశేషం. మరి ఆ వర్క్ అవుట్ వీడియోని మీరు కూడా చూసేయండి.

కాగా ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది గమనించిన కొంతమంది నెటిజెన్స్ కి ఓ సందేహం కలిగింది. మూవీలోని డైలాగ్స్ తో పాటు ‘కుర్చీ మ‌డ‌త పెట్టి’ సాంగ్ ని కూడా ఆయా లాంగ్వేజ్స్ లో వినిపించారు..? వినిపిస్తే కుర్చీ మ‌డ‌త పెట్టి అనే డైలాగ్ ఎలా ఉందని..? డౌట్ వచ్చి ఆ పాటని వినేశారు. అయితే ఓటీటీలో సాంగ్ ని కూడా ఆయా లాంగ్వేజ్స్ లోనే వినిపించారు. ఆ పాటలని కూడా నెటిజెన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.