సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు వీరంగం

  • Publish Date - September 27, 2019 / 06:33 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ బాడీ గార్డు వీరంగం సృష్టించాడు. స్థానికంగా హల్ చల్ చేశాడు. వాహనాలను ధ్వంసం చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. తాళ్లు, వలతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా కూడా అతను విడిపించుకొనే ప్రయత్నం చేశాడు. పదుల సంఖ్యలో ఉన్న స్థానికుల సహకారంతో అతడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.

Read More : పూరీ పెద్దమనసు : డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్‌కి ఆర్ధిక సహాయం
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవడం, మతిస్థిమితం కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్‌కు ఖురేషి అనే వ్యక్తి గతంలో బాడీగార్డుగా ఉండేవాడు. ముంబైలో బౌన్సర్‌గా పనిచేసేవాడు. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నించినా..ఖురేషి ప్రతిఘటించాడు. చివరకు వలలు, తాళ్ల సహాయంతో పట్టుకున్నారు.