Health Camp : ఫిలిం జర్నలిస్ట్ లకు ఉచిత కంటి పరీక్షలు.. ప్రియదర్శి, నాగ వంశీ గెస్టులుగా..

ఫిలిం జర్నలిస్ట్ లకు, వారి ఫ్యామిలీలకు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత కంటి పరీక్షలు చేసారు.

Free Eye Screening Tests to Film Journalists by Telugu Film Journalist Association Priyadarshi and Nagavamsi as Guests

Health Camp : తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో నిన్న శనివారం నాడు ఫిలిం జర్నలిస్ట్ లకు, వారి ఫ్యామిలీలకు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత కంటి పరీక్షలు చేసారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాయి.

వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం జరిగింది.

Also Read : NC24: నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24.. అంచనాలు పెంచేసిన స్పెషల్ వీడియో.. మీరు చూశారా..

హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి ఆయన చూపు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ… తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. అని తెలిపారు.

ఈ ఐ స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్‌లో‌ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Also Read : Simran: అవును.. ఆంటీ రోల్స్‌లో నటిస్తున్నా.. తప్పేంటి?: సిమ్రన్ మరోసారి ఆగ్రహం