NC24: నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24.. అంచనాలు పెంచేసిన స్పెషల్ వీడియో.. మీరు చూశారా..

The Excavation Begins అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది.

NC24: నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24.. అంచనాలు పెంచేసిన స్పెషల్ వీడియో.. మీరు చూశారా..

Updated On : April 26, 2025 / 6:50 PM IST

NC24: విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మూవీ నాగచైతన్య కెరీర్ లో 24వది. ఇప్ప‌టివ‌రకు తెలుగు తెర‌పై చూడ‌ని స‌రికొత్త మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు కార్తీక్ దీన్ని తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి స్పెష‌ల్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. The Excavation Begins అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో సినిమా కోసం వేసిన ప్ర‌త్యేక సెట్స్‌, నాగ‌చైత‌న్య లుక్‌, ఇత‌ర విష‌యాలు చూపించారు. ఆస‌క్తిక‌ర ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది.

Aslo Read: ప‌వ‌న్ OG సినిమా బిజినెస్ ఆ రేంజ్‌లో జ‌రుగుతుందా?

విరూపాక్ష సినిమాతో మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తన ముద్ర వేసిన కార్తిక్ దండు ఈసారి చైతూతో చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇదో సరికొత్త కాన్సెప్ట్‌ లా ఉంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండు రచయితగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత భమ్ బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చిన కార్తీక్.. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here