Pawan kalyan : పవన్ OG సినిమా బిజినెస్ ఆ రేంజ్‌లో జరుగుతుందా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు

Pawan kalyan OG BUSINESS SHOCK
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన నటిస్తున్న రెండు సినిమాలపై పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంది. హరి హర వీరమల్లు, ఓజిలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూడటానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారు. అయితే ఓజి సినిమా బిజినెస్ పై టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు పవన్ నటించిన ఏ సినిమాకు జరగనంత బిజినెస్.. ఓజిపై జరుగుతుందంటా. అంతే కాదు ఓజి కంటే ముందే హరి హర వీరమల్లు రిలీజ్ అవుతుంది. దీని కంటే ఓజికే ఎక్కువ బిజినెస్ జరుగుతుందంటా.
ఓజీ సినిమాపై ఇప్పటి వరకు ఏపీలో 200 కోట్ల పైనే బిజినెస్ ఒప్పందాలు జరుగుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉండడంతో.. ఓజిపై తెగ ఆసక్తి ఏర్పడిందట.
ఇక మిగతా ఏరియాలు, ఓటిటి, శాటిలైట్ ఇలా అన్నింటిని కలుపుకుంటే ఓజి బిజినెస్ భారీగానే జరిగేలా ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే హరి హర వీరమల్లు నిర్మాత కూడా భారీగానే బిజినెస్ చేస్తున్నారట. ఒక్క ఏపిలోనే దాదాపు 100 కోట్ల దాకా అన్ని ఏరియాలకు అమ్ముతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది.
Mana Iddari Prema Katha : ‘మన ఇద్దరి ప్రేమ కథ’ మూవీ రివ్యూ..
దీంతో దటీజ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట. రిలీజ్ కాకముందే ఓజీ, హరిహరవీరమల్లు కాసుల వర్షం కురిపిస్తుంటే.. ఇక రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ బద్దలైనట్లే అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదలయ్యేది ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఎప్పుడు రిలీజ్ అయినా చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారట. మరి ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు విడుదలై ఎన్ని సంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.