Mana Iddari Prema Katha : ‘మన ఇద్దరి ప్రేమ కథ’ మూవీ రివ్యూ..
ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.

Iqbal Priyanka Jasper Mounica Mana Iddari Prema Katha Movie Review
Mana Iddari Prema Katha Movie Review : ఇక్బాల్, మోనికా జంటగా తెరకెక్కిన సినిమా ‘మన ఇద్దరి ప్రేమ కథ’. ఇక్బాల్ స్వీయ దర్శక నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. అనాథ అయిన నాని (ఇక్బాల్) శృతి (మోనికా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నాని – శ్రుతి ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ బీచ్‌కి వెళ్లగా అక్కడ ఓ సంఘటనతో వాళ్ళ కథ మలుపు తిరుగుతుంది. నాని, శ్రుతి మధ్యలోకి అను (ప్రియా జస్పర్) రావడం, అనుకోకుండా నాని, అను దగ్గరవ్వడం, వారి సన్నిహిత వీడియో ఒకటి వైరల్ అవడం జరుగుతుంది. దీంతో గ్రామస్తులు నాని – అనుకి పెళ్లి జరిపిస్తారు. అయితే శృతిని ప్రేమించిన నాని అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో కాపురం చేశాడా? నానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? శృతి ఏమైంది? బీచ్ లో ఏం జరిగింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Chaurya Paatam : ‘చౌర్య పాఠం’ మూవీ రివ్యూ.. బ్యాంక్ దొంగతనానికి వెళ్తే ఏం జరిగింది..?
సినిమా విశ్లేషణ.. ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రేమ కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. లవ్ స్టోరీని బాగానే రాసుకున్నారు. ప్రేమ ఎమోషన్ ని బాగానే పండించారు. సినిమా ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. లవ్ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. సినిమాలో ప్రేమకు సంబంధించి ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ కొత్తగా షాకింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ గురించి అయితే ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఓ పక్క డైరెక్టర్ గా, నిర్మాతగా కష్టపడుతూనే హీరోగా మంచి ఎమోషన్ పండించాడు ఇక్బాల్. ప్రియా జస్పర్ క్యూట్ గా అందంతో అలరిస్తూ బాగానే నటించింది. మోనికా కూడా తన నటనతో మెప్పించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Nani : పాపం.. సినిమా ఇండస్ట్రీలో నాని ఫస్ట్ శాలరీ.. చెక్ బౌన్స్ అయి.. ఎంత లాస్ అంటే..?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. లవ్ డైలాగ్స్ బాగానే రాసుకున్నారు. రెగ్యులర్ కథని కాస్త ఎమోషన్ జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు ఇక్బాల్. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మన ఇద్దరి ప్రేమకథ’ ఒకర్ని ప్రేమించి అనుకోకుండా ఇంకకర్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏం జరిగింది అని లవ్ ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.