Nani : పాపం.. సినిమా ఇండస్ట్రీలో నాని ఫస్ట్ శాలరీ.. చెక్ బౌన్స్ అయి.. ఎంత లాస్ అంటే..?
నాని మొదట రాధాగోపాళం సినిమాకు అప్రెంటిస్ గా, క్లాప్ అసిస్టెంట్ గా చేసాడు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు.

Nani Loss his First Salary in Film Industry due to Cheque Bounce
Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు నాని. త్వరలో మే 1న హిట్ 3 సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో నాని సినీ పరిశ్రమలో తాను తీసుకున్న మొదటి శాలరీ గురించి చెప్పుకొచ్చాడు.
నాని మొదట రాధాగోపాళం సినిమాకు అప్రెంటిస్ గా, క్లాప్ అసిస్టెంట్ గా చేసాడు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు.
Also Read : Kaliyugam 2064 : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్.. భవిష్యత్తులో నీళ్లు, ఆహరం దొరక్కపోతే..
నాని తన మొదటి శాలరీ గురించి మాట్లాడుతూ.. నేను మొదట చేసిన సినిమాకు అప్రెంటిస్ గా, క్లాప్ అసిస్టెంట్ గా చేశాను. అప్రెంటిస్ కు శాలరీ ఉండదు, ఆ విషయం ముందే చెప్పారు. దాంతో నాకు శాలరీ రాదు అనే పనిచేసాను. కానీ చివరి షెడ్యూల్ అయిపోయాక అందరికి శాలరీలు ఇస్తున్నప్పుడే నాకు కూడా 2500 రూపాయల చెక్ ఇచ్చారు. అందరూ విత్ డ్రా చేసేసుకున్నారు. కానీ నేను 20 రోజుల తర్వాత వెళ్తే చెక్ బౌన్స్ అయింది అన్నారు. అప్పుడు ఆ నిర్మాతకు ఏదో సమస్యలు ఉండటంతో అలా జరిగింది. మళ్ళీ వెళ్లి అడగాలనిపించలేదు. ఇంక ఆ డబ్బులు రానట్టే, ఆ చెక్ పనిచేయదు అని జాగ్రత్తగా దాచుకున్నాను అని తెలిపారు.
అలాగే.. ఆ తర్వాత అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. ఆ సినిమాకు మొదట సాలరీ 4000 రూపాయలు. చెక్ ఇవ్వబోతే భయంతో వద్దు అని క్యాష్ అడిగితే 100 రూపాయల నోట్లు ఇచ్చారు. ఓ నాలుగు నెలల డబ్బు దాచుకొని అమ్మ నాన్నలకు రింగ్స్ చేయించాను అని తెలిపారు నాని.
Also Read : Gymkhana : ‘అలప్పుజ జింఖానా’ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే..