Kaliyugam 2064 : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్.. భవిష్యత్తులో నీళ్లు, ఆహరం దొరక్కపోతే..
మీరు కూడా కలియుగమ్ 2064 ట్రైలర్ చూసేయండి..

Shraddha Srinath Kaliyugam 2064 Movie Trailer Released
Kaliyugam 2064 : శ్రద్దా శ్రీనాథ్, కిషోర్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్, అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా ‘కలియుగమ్ 2064’. RK ఇంటర్నేషనల్ బ్యానర్ పై KS రామకృష్ణ నిర్మాణంలో ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని మే 9న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఆర్జీవీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
Also Read : Gymkhana : ‘అలప్పుజ జింఖానా’ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే..
మీరు కూడా కలియుగమ్ 2064 ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. 2064 లో ప్రపంచం ఎలా ఉండనుంది? నీళ్లు, ఆహరం కరువుగా మారితే ప్రజలు ఏం చేస్తారు. అలాంటి సమయంలో ఓ ఇద్దరికి ఫుల్ ఫుడ్, వాటర్ ఉన్న ఇల్లు కనపడితే ఏం చేశారు అని సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..
ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆర్జీవీ మాట్లాడుతూ.. కలియుగమ్ 2064 ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి, క్యారెక్టర్స్ డిజైన్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి అని తెలిపారు.