Gymkhana : ‘అలప్పుజ జింఖానా’ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే..

మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజయి భారీ విజయం సాధించి 50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న తెలుగులో రిలీజయింది.

Gymkhana : ‘అలప్పుజ జింఖానా’ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే..

Premalu Fame Naslen Gafoor Gymkhana Movie Review and Rating

Updated On : April 25, 2025 / 4:04 PM IST

Gymkhana Movie Review : ప్రేమలు ఫేమ్ నస్లేన్, లక్మన్ అవరన్, గణపతి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, అనఘ రవి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన మలయాళం సినిమా ‘అలప్పుజ జింఖానా’. మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజయి భారీ విజయం సాధించి 50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న తెలుగులో రిలీజయింది. ఖలీద్ రెహమాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.

కథ విషయానికొస్తే.. జోజు(నస్లేన్) అతని ఫ్రెండ్స్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. అదే సమయంలో జోజు ఫ్రెండ్ ఓ అమ్మాయిని ట్రై చేస్తుంటే ఒక బాక్సర్ వచ్చి కొడతాడు. దీంతో వీళ్లు స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో సీట్ తెచ్చుకోడానికి, ఎవరైనా వస్తే కొట్టడానికి అన్నట్టు బాక్సర్స్ అవ్వాలని ఫిక్స్ అవుతారు. జోజు, అతని ఫ్రెండ్స్ అలప్పుజ జిల్లాలోని జింఖానా అనే బాక్సింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. అయితే వీళ్లంతా బాక్సింగ్ ని సీరియస్ గా తీసుకోకుండా కామెడీగా నెట్టుకొస్తారు.

జిల్లా పోటీల్లో ఏదో ఒకటి చేసేసి గెలవడంతో వీళ్లంతా కేరళ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి సెలెక్ట్ అవుతారు. వీళ్ళతో పాటు సిన్సియర్ గా బాక్సింగ్ ఆడే దీపక్(గణపతి) అనే వ్యక్తి కూడా జాయిన్ అవుతాడు. వీళ్ల కోసం స్పెషల్ గా ఓ నేషనల్ లెవల్ బాక్సర్ జోషువా(లక్మన్)ని కోచ్ గా తీసుకొస్తారు. ఆ కోచ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? జోజు, అతని ఫ్రెండ్స్ కేరళ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలుస్తారా? దీపక్ గెలుస్తాడా? ఆ ఛాంపియన్ షిప్ కోసం వెళ్లి అక్కడ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

సినిమా విశ్లేషణ.. ఇటీవల మలయాళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమలు హిట్ అవ్వడంతో ఆ హీరో ఉన్నాడని ఈ జింఖానా కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. కొంతమంది కుర్రాళ్ళు ఏదో ఆవేశంలో బాక్సింగ్ నేర్చుకోవాలని వెళ్లి సీరియస్ నెస్ లేకుండా కామెడీ చేస్తూ ఆడితే ఎలా ఉంటుంది అని కామెడీగా తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళు బాక్సింగ్ నేర్చుకోవాలనుకోవడం, జిల్లా లెవల్ లో ఏదో ఒకటి చేసి గెలవడం, మధ్య మధ్యలో అమ్మాయిలతో లవ్ స్టోరీలతో కాసేపు బోర్ కొట్టినా అక్కడక్కడా కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ లో వీళ్ళు స్టేట్ లెవల్ పోటీలకు వెళ్లి ఏం చేస్తారు అని ఓ చిన్న ఇంట్రెస్ట్ తో సింపుల్ గా ఇచ్చేసారు. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ బాక్సింగ్ మ్యాచ్ లతోనే సాగుతుంది. అయితే అనుకున్నట్టు కాకుండా కథ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కోచ్ ని బాగా ఎలివేట్ చేసి, అతనికి ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అనేలా బిల్డప్ ఇచ్చినా అదేంటి అనేది పూర్తిగా చెప్పలేదు. చివర్లో కొన్ని సీన్స్ లో లాజిక్ లేకుండా ఎక్కడివి అక్కడ వదిలేసినట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ బాగానే వర్కౌట్ చేసారు. అయితే క్లైమాక్స్ మాత్రం తెలుగు ఆడియన్స్ ఊహించినట్టు ఉండదు. సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా సీక్వెల్ కి లీడ్ అయితే ఇచ్చారు.

Gymkhana Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. ప్రేమలు ఫేమ్ నస్లేన్ ఈ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. చిరుత పాత్రలో ఫ్రాంకో ఫ్రాన్సిస్ బాగా నవ్వించాడు. కోచ్ పాత్రలో లక్మన్ బాగానే మెప్పించాడు. దీపక్ పాత్రలో గణపతి సిన్సియర్ బాక్సర్ గా బాగా నటించాడు. అనఘ రవి లేడీ బాక్సర్ పాత్రలో మెప్పించింది. షైన్ చాం టాకో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు కానీ ఆ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. బాక్సింగ్ షాట్స్ అన్ని చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. పాటలు యావరేజ్. సినిమా అంతా చాలా తక్కువ లొకేషన్స్ లోనే తీసేసారు. తెలుగు డబ్బింగ్ కి డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఓ రెగ్యులర్ కథే అయినా ఊహించని క్లైమాక్స్ తో డిఫరెంట్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. నిర్మాణ పరంగా సినిమా చిన్న బడ్జెట్ లోనే పూర్తయిందని తెలుస్తుంది.

మొత్తంగా ‘అలప్పుజ జింఖానా’ సినిమా బాక్సర్స్ అవ్వాలనుకున్న కుర్రాళ్ళు స్టేట్ లెవల్ ఛాంపియన్ షిప్ వరకు వెళ్లి అక్కడ ఏం చేసారు అని కామెడీగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.