Tollywood : శుక్రవారం రెండు తెలుగు సినిమాలు రిలీజ్
శుక్రవారం థియేటర్లలో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఒకటి అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన లవ్ స్టోరీ మూవీ
- kunduru Vinod
- Published On : September 20, 2021 / 08:17 PM IST
Tollywood
Tollywood : ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియోటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలా రోజుల తరువాత థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నది. చాలా సినిమాలు ఓటీటీకే పరిమితం కాగా, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగచైతన్య లవ్‌స్టోరీ ఒకటి కాగా రెండో సినిమా మరో ప్రస్థానం.
Read More : Home delivery: మద్యం హోం డెలివరీ.. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఇదే.. 100శాతం హైదరాబాదీల సపోర్ట్!
ఆదివారం లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా, అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరింది. ఇప్పటికే సినిమా సాంగ్స్‌తో పాటుగా, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక ఇదిలా ఉంటే, లవ్‌స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే తనీష్ మరోప్రస్థానం సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. విలన్ బృందం వరస హత్యలు చేస్తుండగా, వాటిపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమేరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమేరా విలన్‌లకు దొరుకుంది.
Read More : Chandigarh Court : అభ్యంతరం లేకపోతే 18 ఏళ్లలోపు మైనర్ బాలిక పెళ్లి చెల్లుతుంది – కోర్టు
ఆ తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన అంశంలో థ్రిల్లింగ్‌గా కథను తెరకెక్కించారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
