Home delivery: మద్యం హోం డెలివరీ.. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఇదే.. 100శాతం హైదరాబాదీల సపోర్ట్!

మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే.

10TV Telugu News

Home delivery: మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే. వైన్ షాపులు వద్ద మద్యం కిటకిటను తగ్గించేందుకు మద్యం హోండెలివరీ విషయంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హోం డెలివరీ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ISWAI) ఇటీవల నిర్వహించిన ఎనిమిది రాష్ట్రాల అధ్యయనంలో 100% మంది హైదరాబాదీలు మాత్రమే మద్యం హోండెలివరీ సేవను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ప్రముఖ నగరాలలో సగటు 70% మంది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి మరియు నల్గొండ వంటి తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో హోమ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వేలో గమనించారు.

ఇప్పటికే మేఘాలయ, పంజాబ్‌, పుదుచ్చేరి, న్యూఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేస్తుండగా.. మరిన్ని రాష్ట్రాలు కూడా మద్యం హోండెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ISWAI సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణకు సంబంధించి 7వేల 500 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో వంద శాతం మంది మద్యం హోమ్ డెలివరీకి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి… మొత్తం డబ్బును చెల్లిస్తే సమీపంలోని వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలని చాలామంది మద్యం ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో మద్యం తాగేవారి నుంచి తీసుకున్న వివరాల ప్రకారం.. 100శాతం మంది మద్యం హోం డెలివరీకి సపోర్ట్ చెయ్యగా.. వారిలో, దాదాపు 60% మంది సౌలభ్యం కోసం హోమ్ డెలివరీ బాగుంటుందని, 40% మంది సామాజిక దూరం మరియు భద్రత కోసం సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంకా, 50% ప్రతి హోం డెలివరీ చేసినందుకు రూ.50 నుంచి రూ .100 వరకు ఫీజును ఇచ్చేందుకు ఇష్టపడగా.. మిగిలిన వారు ఆర్డర్ విలువలో 5% నుంచి 10% వరకు ఫీజు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది హోం డెలివరీ వల్ల మద్యం ధరల్లో పారదర్శకత వస్తుందని, నాణ్యమైన మద్యం లభిస్తుంది 63శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఈ కామర్స్‌ యాప్‌ల ద్వారానే హోండెలివరీ చేస్తే బాగుంటుందని 60శాతం మంది అభిప్రాయపడ్డారు. కల్తీని అరికట్టవచ్చునని 37శాతం మంది చెప్పారు.