Chandigarh Court : అభ్యంతరం లేకపోతే 18 ఏళ్లలోపు మైనర్ బాలిక పెళ్లి చెల్లుతుంది – కోర్టు

మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిన పెండ్లిని 18 ఏండ్లలోపు మహిళ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, పెండ్లిని రద్దు చేయాలని కోర్టును కోరకపోతే ఆ వివాహం చెల్లుతుందని చండీగఢ్ హైకోర్టు తెలిపింది.

Chandigarh Court : అభ్యంతరం లేకపోతే 18 ఏళ్లలోపు మైనర్ బాలిక పెళ్లి చెల్లుతుంది – కోర్టు

Chandigarh Court

Chandigarh Court : మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేస్తే ఆ పెళ్లి చెల్లదనే విషయం విషయం అందరికి తెలిసిందే.. అయితే మైనర్ బాలిక పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిన పెండ్లిని 18 ఏండ్లలోపు మహిళ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, పెండ్లిని రద్దు చేయాలని కోర్టును కోరకపోతే ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్‌, హర్యానా హైకోర్టు తెలిపింది. దంపతులు విడిపోవాలని కోరుకుంటే కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చని.. ఆ వివాహం రద్దు చేయడం కుదరదని జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అరుణ్ మోంగాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Read More : Charanjit Singh Channi : కొత్త సీఎంకి మీటూ ఆరోపణల సెగ… రాజీనామా చేయాలని డిమాండ్

మైనర్ బాలిక వివాహం కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. 17 ఏండ్ల ఆరు నెలల 8 రోజుల వయసున్న బాలికకు 2019లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒకరు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2020 జూన్ 22న లుధియానా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై చేపట్టిన కోర్టు.. మైనర్ బాలికలు వివాహం చేశారని.. హిందూ వివాహ చట్టం సెక్షన్ 5(iii) ప్రకారం ఈ పెళ్లికి గుర్తింపు లేదని దీనిని రద్దు చేయడం కుదరదని తెలిపింది కోర్టు. వారిని విడాకులు మంజూరు చేయలేమని పిటిషన్ తిరస్కరించింది కోర్టు.

Read More : Chinna Jeeyar Swamy: ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి సహస్రాబ్ది మహోత్సవాలు -చినజీయర్‌ స్వామి

లూధియానా కోర్టు తిరస్కరించడంతో పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(2) (iv) ప్రకారం అమ్మాయికి 15 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగినప్పుడు మాత్రమే పెండ్లి శూన్యత లేదా రద్దు కోసం 18 ఏండ్లు నిండకముందే ఆమె పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆ బాలికకు 17 ఏండ్లు నిండిన తర్వాత ఆమె సమ్మతితో జరిగిన పెండ్లిగా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే ఈ పెళ్లి చెల్లుతుందని రద్దు చేయడం కుదరదని.. విడాకులు కొరవచ్చని తెలిపింది. తుదకు వారికి విడాకులు ఇచ్చింది కోర్టు.