Tollywood: ఆర్ఆర్ఆర్ నుండి బ్యాచిలర్ వరకు.. సినిమాలన్నీ స్టార్ మా సొంతం!

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ క్రేజీ సినిమాల జాబితా చూస్తే డజనుకుపైనే కనిపిస్తున్నాయి. ఏ సినిమాకి ఆ సినిమా ఓ రేంజిలో ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా సిద్ధమవుతున్నాయి. నిజానికి కరోనా లాక్ డౌన్ లేకుంటే ఇన్ని సినిమాలు వెయిటింగ్ లిస్టులో ఉండేది కాదేమో కానీ ఇప్పుడైతే టాలీవుడ్ లో డజనుకు పైగా సినిమాలు భారీ హైప్ సొంతం చేసుకున్నాయి.

Tollywood

Tollywood: టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ క్రేజీ సినిమాల జాబితా చూస్తే డజనుకుపైనే కనిపిస్తున్నాయి. ఏ సినిమాకి ఆ సినిమా ఓ రేంజిలో ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా సిద్ధమవుతున్నాయి. నిజానికి కరోనా లాక్ డౌన్ లేకుంటే ఇన్ని సినిమాలు వెయిటింగ్ లిస్టులో ఉండేది కాదేమో కానీ ఇప్పుడైతే టాలీవుడ్ లో డజనుకు పైగా సినిమాలు భారీ హైప్ సొంతం చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

రాజమౌళి-తారక్-చరణ్ ఈ కాంబినేషన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని భారత సినిమా మొత్తం ఎదురుచూస్తుంది. వీటికి తోడు బన్నీ-సుకుమార్ల పుష్ప రెండు భాగాలు, మహేష్ బాబు సర్కారు వారి పాట, బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడెప్పుడా ఎదురుచూసేలా చేస్తున్నాయి.

సీనియర్ హీరోలకు తోడు యంగ్ హీరోల సినిమాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందులో నాని టాక్ జగదీష్, నాగచైతన్య-సాయిపల్లవిల లవ్ స్టోరీతో పాటు అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నితిన్ మాస్ట్రో సినిమాలు కూడా మోస్ట్ వెయిటింగ్ జాబితాలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాల శాటిలైట్ హక్కులన్నీ స్టార్ మా కొనేసింది. ఆర్ఆర్ఆర్ నుండి బ్యాచిలర్ వరకు దేన్నీ వదలకుండా అన్నిటిని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలన్నీ విడుదలైతే ఇక మా ప్రేక్షకులకు పండగే పండగ అనుకోవచ్చు.