డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’
కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా రూపొందిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ డిసెంబర్ 6న విడుదల కానుంది..

కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా రూపొందిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ డిసెంబర్ 6న విడుదల కానుంది..
కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా కొత్త అవతారమెత్తాడు. ఆకృతి – ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా.. ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. ‘మంచి రసగుల్లా లాంటి సినిమా’ అనేది ట్యాగ్ లైన్. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రీసెంట్‌గా రిలీజ్ డేట్ లాక్ చేశారు. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. యాక్షన్, సెంటింమెంట్ లేకుండా కేవలం కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీకి రైటర్‌గా పనిచేసిన పరమ్ సూర్యాన్షు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.
Read Also : శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ – ఫస్ట్‌లుక్
సాకేత్ కోమండూరి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలో ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. ట్రైలర్ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి.
Full-Length Comedy Entertainer #BhagyaNagaraVeedulloGammathu will be releasing on December 6, 2019.
Get Ready For The Fun Ride. No Action, No Sentiment, Only COMEDY!
Directed & Produced by @Actorysr
Music by @SakethKomanduri
Starring @Actorysr #DollySha @vennelakishore pic.twitter.com/AE4GfYE66r
— Srinivasareddy (@Actorysr) November 16, 2019