Salman Khan House : సల్మాన్ ఇంటితో ఇకపై సెల్ఫీలు, వీడియోలు నో.. మీడియాకు నో పర్మిషన్.. అష్టదిగ్బంధనంలో సల్మాన్ ఇల్లు..

తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ ఇచ్చారని తెలుస్తుంది.

Full Security to Salman Khan House in Mumbai Even No photos and No Video Permitted

Salman Khan House : సల్మాన్ ఖాన్ కి ఎప్పట్నుంచో బిష్ణోయ్ గ్యాంగ్ వాళ్ళ థ్రెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత బాబా సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపేశారు. బాబా సిద్ధిఖీ సల్మాన్ కి చాలా క్లోజ్. ఆయన మరణం తర్వాత కూడా సల్మాన్ నివాళులు అర్పించడానికి వచ్చి ఎమోషనల్ అయ్యారు.

అయితే బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సెక్యూరిటీతో తిరుగుతున్న సల్మాన్ కి బాబా సిద్దిఖీ మరణంతో మరింత సెక్యూరిటీని పెంచారు. తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ ఇచ్చారని తెలుస్తుంది. అలాగే సల్మాన్ ఇంటి బయట కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. సల్మాన్ ఖాన్ ఇంటిని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ పోస్టర్ వచ్చేసింది.. బాలయ్య బోయపాటి మళ్ళీ వచ్చేస్తున్నారు.. ఈసారి పాన్ ఇండియా టార్గెట్..

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పలు ఆంక్షలు పెట్టారు. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇల్లు ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ కి రోజూ అభిమానులు, మీడియా వస్తూ ఉంటారు. బయట నుంచే సల్మాన్ ఇంటిని వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. తాజా పరిమాణాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఎవరూ సెల్ఫీలు తీసుకోకూడదని, వీడియోలు, ఫోటోలు తీయరాదని, మీడియాకు కూడా అక్కడికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఇంట్లోకి కూడా ఎవర్ని వెళ్లనివ్వట్లేదని, కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళు తప్ప ఎవరికీ లోపలి అనుమతి లేదని, ఎవరైనా అనుమానాస్పదంగా ఆ ఏరియాలో కనిపిస్తే పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇంటిని పోలీసులు అష్ట దిగ్బంధనం చేసారని చెప్పుకుంటున్నారు. ఇక సల్మాన్ అయితే ఇంట్లోంచి బయటకు రావట్లేదట. సల్మాన్ భాయ్ కి ఎప్పటిదాకా ఈ కష్టాలో చూడాలి మరి.