Akhanda 2 : ‘అఖండ 2’ పోస్టర్ వచ్చేసింది.. బాలయ్య బోయపాటి మళ్ళీ వచ్చేస్తున్నారు.. ఈసారి పాన్ ఇండియా టార్గెట్..

అఖండ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు.

Akhanda 2 : ‘అఖండ 2’ పోస్టర్ వచ్చేసింది.. బాలయ్య బోయపాటి మళ్ళీ వచ్చేస్తున్నారు.. ఈసారి పాన్ ఇండియా టార్గెట్..

Balakrishna Boyapati Sreenu Akhanda 2 Movie Title Poster Released

Updated On : October 16, 2024 / 8:13 AM IST

Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే పక్కా హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. ఆ మూడు సినిమాలతో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.

Also Read : Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఇన్ని రీ రిలీజ్ లా? ఎందుకో..? ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు..

అయితే అఖండ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. చెప్పినట్టే అఖండ 2 సినిమాని నేడు అనౌన్స్ చేసారు. బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ 2 సినిమా రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా టైటిల్ అనౌన్న్ చేస్తూ ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు. అఖండ 2 టైటిల్ తో పాటు తాండవం అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.

Image

నేడు ఉదయం అఖండ 2 సినిమా పూజా కార్యక్రమం కూడా జరగబోతుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది. అయితే ఈసారి అఖండ 2ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో బాలయ్యకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.