Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఇన్ని రీ రిలీజ్ లా? ఎందుకో..? ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు..

తాజాగా ప్రభాస్ సినిమాలు ఒకేసారి నాలుగు రీ రిలీజ్ అవుతున్నాయి.

Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఇన్ని రీ రిలీజ్ లా? ఎందుకో..? ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు..

Prabhas four Old Movies Re Release on his Birthday Fans Disappointed

Updated On : October 16, 2024 / 7:47 AM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ దూసుకుపోతున్నాడు. రీ రిలీజ్ లలో భాగంగా ఇప్పటికే ప్రభాస్ పలు పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. యోగి లాంటి ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసారు. ఫ్యాన్స్ బలహీనతల్ని దృష్టిలో పెట్టుకొని కేవలం డబ్బుల కోసమే ఈ రీ రిలీజ్ లు చేస్తున్నామని గతంలో పలువురు ఓపెన్ గానే చెప్పారు. అయినా ఫ్యాన్స్ వీటిని ఎంకరేజ్ చేయడంతో దొరికిందే ఛాన్స్ అని అన్ని పాత సినిమాల హక్కులు కొనుక్కొని ఎవరెవరో సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Amala Paul : కొడుకుతో అమలాపాల్ క్యూట్ ఫోటోలు చూశారా..? అమలాపాల్ ఏంటి ఇంత ఛేంజ్ అయిపోయింది..

అయితే తాజాగా ప్రభాస్ సినిమాలు ఒకేసారి నాలుగు రీ రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న ఇప్పటికే ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఒక రోజు ముందే అక్టోబర్ 22 మిస్టర్ పర్ఫెక్ట్ రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. మరో వైపు సలార్ సినిమాని హైదరాబాద్ లో పలు స్పెషల్ షోలు వేస్తున్నారు అక్టోబర్ 23న. అలాగే రెబల్ సినిమాని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

దీంతో ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకే రోజు నాలుగు సినిమాలు రీ రిలీజ్ ఎందుకు అని, అసలు సలార్ మొన్నే కదా రిలీజ్ అయిందని, రెబల్ లాంటి ఫ్లాప్ సినిమా ఎందుకని.. ఇలా అనేక కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. కొంతమంది అయితే రీ రిలీజ్ ల మీదే విరక్తి వచ్చేలా చేస్తున్నారని, కుదిరితే అన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేసేలా ఉన్నారని ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి దీనిపై ప్రభాస్ టీమ్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.