×
Ad

Funky: విశ్వక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టీం..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "ఫంకీ"(Funky). జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Funky movie team announces release date

Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “ఫంకీ”. జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ కాయదు లాహోర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ(Funky) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫంకీ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Rajinikanth-Kamal Haasan: ఒకరు నిర్మాత.. ఒకరు హీరో.. క్రేజీ కాంబో సెట్ .. డైరెక్టర్ ఎవరో తెలుసా..

ఈ నేపధ్యంలోనే తాజాగా ఫంకీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 3న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలాగే, గత కొంత కాలంగా హిట్స్ లేక బాధపడుతున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో భారీ హిట్ సాదించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జాతిరత్నాలు తరువాత దర్శకుడు అనుదీప్ కి కూడా సరైన హిట్ లేదు. కాబట్టి, ఫంకీ సినిమా ఈ ఇద్దరికి అదిరిపోయే కంబ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.