Gaddar Awards : జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డుల మీటింగ్.. మొత్తం ఎన్ని ఎంట్రీలు వచ్చాయంటే..

తాజాగా గద్దర్ అవార్డుల జ్యూరీ మీటింగ్ జరిగింది.

Gaddar Film Awards Jury Meet Held Under Jayasudha Leadership

Gaddar Awards : నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని కొన్నాళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి విధి విధానాలు రూపొందించడానికి ఓ కమిటీని కూడా వేశారు. ఇటీవల గద్దర్ అవార్డులకు అప్లై చేసుకోమని ప్రకటించారు.

తాజాగా గద్దర్ అవార్డుల జ్యూరీ మీటింగ్ జరిగింది. నటి జయసుధ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జయసుధ, దిల్ రాజు, పలువురు ప్రభుత్వ అధికారుల సమక్షంలో గద్దర్ అవార్డులకు సంబంధించి మీటింగ్ జరిగింది.

Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ..

ఈ అవార్డులకు మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. అందులో 1176 వ్యక్తిగత నామినేషన్లు, 76 సినిమా, డాక్యుమెంటరీ నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు. ఈ సినిమాలను ఏప్రిల్ 21 నుంచి జ్యూరీ సభ్యులు చూడనున్నారు. అనంతరం త్వరలోనే గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు జ్యూరీ మెంబర్స్.