GAMA Awards
GAMA Awards : గామా అవార్డ్స్ GAMA – (Gulf Academy Movie Awards) 2025 సంవత్సరానికి 5వ ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు జరగ్గా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. తాజాగా నేడు ఈ ఈవెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు.(GAMA Awards)
ఈ ఈవెంట్ కి గామా సీఈవో సౌరబ్ కేసరి, మెయిన్ స్పాన్సర్ వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ తో పాటు హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
Also Read : Pawan Kalyan : OG నుంచి కలర్ ఫుల్ పోస్టర్.. సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
గామా కర్టెన్ రైజర్ ఈవెంట్లో గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ.. మా నాన్న గారికి కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దుబాయ్ లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ ఉంటుంది అని అన్నారు.
జ్యూరీ సభ్యులు, దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి, బి గోపాల్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మేము, కోటి సహా పలువురు ప్రముఖులు జ్యురీ సభ్యులుగా ఉన్నాం. అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. దుబాయ్ లో ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది అని అన్నారు.
Also Read : Balakrishna : ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలయ్య పేరు.. ఎందుకో తెలుసా?
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. గతేడాది జరిగిన నాల్గవ ఎడిషన్ గామా అవార్డ్స్ లో స్పెషల్ పర్ఫార్మన్స్ చేశాను. ఈసారి కూడా స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నాను అని తెలిపింది. అలాగే గామా అవార్డ్స్ లో యాంకర్ సుమతో పాటు వ్యాఖ్యాతగా తాను కూడా ఉండబోతున్నట్టు నటుడు వైవా హర్ష తెలిపాడు.
ఆగస్టు 29న గామా ఎక్సలెన్స్ అవార్డ్స్, ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్ భారీగా దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి అనేకమంది సినీ హీరోలు, హీరోయిన్స్, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. 2024 లో రిలీజయిన సినిమాలకు గాను ఈ సంవత్సరం అవార్డులు అందివ్వనున్నారు.