Game Changer : తమిళనాడు, కర్ణాటకలో గేమ్ ఛేంజర్ కి షాక్.. రిలీజ్ దగ్గర పడుతుంటే ఈ ఇబ్బందులు ఏంటి?

తమిళనాడు, కర్ణాటకలో గేమ్ ఛేంజర్ కి షాక్.. రిలీజ్ దగ్గర పడుతుంటే ఈ ఇబ్బందులు ఏంటి?

Game Changer faces Difficulties in for Release in Tamilnadu and Karnataka

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. జనవరి 10న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజవుతుంది. సినిమాపై మంచి హైప్ ఉంది. సాంగ్స్, ట్రైలర్, టీజర్ అన్ని వైరల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చారు. తమిళ్ లో అజిత్ సినిమా కూడా వాయిదా పడింది.

Also Read : Daaku Maharaaj : మామ ఈవెంట్‌కు అల్లుడు గెస్ట్..!

ఇలా ఇప్పటివరకు ఈ సినిమాకు అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. కానీ రిలీజ్ సమయానికి గేమ్ ఛేంజర్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఎప్పుడూ ఉండే కన్నడ భాష గొడవ జరుగుతుంది. తాజాగా సినిమా టైటిల్ కన్నడ లో లేదని, కన్నడలో పోస్టర్స్ రిలీజ్ చేయలేదని కర్ణాటకలో అతికించిన గేమ్ ఛేంజర్ పోస్టర్స్ పై బ్లాక్ పెయింట్ వేస్తున్నారు కన్నడ భాషాభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమాపై విమర్శలు చేస్తూ, ఈ సినిమాని బహిష్కరించాలని హడావిడి చేస్తున్నారు. మరి రిలీజ్ సమయానికి ఈ గొడవ చల్లారుతుందా లేదా చూడాలి. ఇటీవలే కన్నడ హీరో సుదీప్ తన మ్యాక్స్ సినిమా టైటిల్ కన్నడలో లేదు ఎందుకు అని అంటే ఇలాంటి వాళ్ల అందరికి కలిపి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాపై ఇలా నెగిటివిటి చూపిస్తున్నారు.

ఇక తమిళనాడులో స్టార్ హీరో అజిత్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ కి అక్కడ బాగా కలిసొస్తుందని అంచనా వేశారు. అసలే తమిళనాడులో ఈ సినిమాని 32 కోట్లకు కొన్నట్టు సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఆపాలని లైకా నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. లైకా నిర్మాణ సంస్థలో శంకర్ ఇటీవల ఇండియన్ 2 చేసాడు. ఇండియన్ 3 సినిమా కూడా ఉంది.

Also Read : Dil Raju : తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచ‌మ‌ని సీఎంను అడుగుతాను.. మీడియా స‌మావేశంలో దిల్‌రాజు కామెంట్స్ వైర‌ల్‌..

గతంలోనే ఇండియన్ 2 సినిమా పూర్తయ్యేవరకు శంకర్ ఏ సినిమా చెయ్యకూడదు అని లైకా ఇబ్బందులు పెట్టడంతో గేమ్ ఛేంజర్ ని మధ్యలోనే వదిలేసి ఇండియన్ 2 పూర్తిచేసి మళ్ళీ గేమ్ ఛేంజర్ కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ లైకా శంకర్ ఇండియన్ 3 పూర్తిచేసేదాకా గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయొద్దు అని తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించడం చర్చగా మారింది. మరి గేమ్ ఛేంజర్ తమిళనాడులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అవుతుందా? కర్ణాటకలో సాఫీగా రిలీజ్ అవుతుందా చూడాలి. ఇన్నాళ్లు మంచి హైప్ ఇచ్చి రిలీజ్ కి ముందు ఇలాంటి ఇబ్బందులు ఏంటి అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.