Dil Raju : తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచమని సీఎంను అడుగుతాను.. మీడియా సమావేశంలో దిల్‌రాజు కామెంట్స్ వైరల్..
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తెలంగాణలో టికెట్ల రేటు పెంపునకు సంబంధించి నిర్మాత్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

Game Changer comeback film for me Dil Raju
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్ర టికెట్ల రేటు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో ఏ చిత్రానికి బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తెలంగాణలో టికెట్ల రేటు పెంపునకు సంబంధించి నిర్మాత్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
Pushpa 2 : ‘పుష్ప 2’ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వద్ద ఆగేదేలే..
గేమ్ ఛేంజర్ పీ రిలీజ్ ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచినందుకు అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నా కం బ్యాక్ సినిమా గేమ్ ఛేంజర్..
గేమ్ ఛేంజర్ ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు. మూడున్నర సంవత్సరాల గేమ్ ఛేంజర్ జర్నీలో ఎత్తు పల్లాలను చూసినట్లుగా చెప్పారు. సినిమా ఫీల్డ్ లో సక్సెస్ ఉంటేనే ఏదైనా చేయగలమన్నారు. నాకు కం బ్యాక్ సినిమా గేమ్ ఛేంజర్. ఇక ఈ చిత్రాన్ని చూసి చిరంజీవి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు వావ్ అనేరీతిలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలోని పాటల మీద రూ.75 కోట్ల వరకు ఖర్చు చేశాము. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బాగా వచ్చింది. ఎఫ్ 2 చిత్రాన్ని ఎంతలా ఎంజాయ్ చేశారో ఈ చిత్రాన్ని అలా ఎంజార్ చేస్తారు. సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారు అని దిల్ రాజు అన్నారు.
తెలంగాణలో టికెట్ల పెంపు పై..
తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుతానని దిల్ రాజు అన్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్ మెంట్‌ను కోరినట్లు చెప్పారు. టికెట్ల రేట్ల పెంపు పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని తాను అనుకుంటున్నానని చెప్పారు. ఓ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేస్తానన్నారు.
ఇక గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి తిరిగి వెలుతున్న క్రమంలో యాక్సిడెంట్‌కు గురై ఇద్దరు యువకులు చనిపోయారు. దీనిపై స్పందిస్తూ వారిద్దరి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు దిల్ రాజు. ఆ రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం చేసి ఆదుకుంటామన్నారు.